Friday, March 6, 2026

టీటీడీ ఆల‌యాల అర్చ‌కుల‌కు పున‌శ్చ‌ర‌ణ త‌ర‌గ‌తులు ప్రారంభం

- Advertisement -
Refresher Classes for Priests of TTD Temples Begin

తిరుపతి
టీటీడీ ఆలయాల్లో ప‌నిచేస్తున్న‌ అర్చకులకు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఉద్యోగుల శిక్ష‌ణ సంస్థ‌(శ్వేత) ఆధ్వర్యంలో మూడు రోజుల పునశ్చరణ తరగతులు మంగళవారం తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా ఎస్వీ వేదవర్సిటీ ఉపకులపతి ఆచార్య రాణి సదాశివమూర్తి మాట్లాడుతూ ఆగమాలు సాక్షాత్తు భగవంతుడు ఉపదేశించినవని, అలాంటి ఆగమాల్లో పేర్కొన్న విధంగా ఆలయాల్లో సంప్రదాయబ‌ద్ధంగా అర్చకత్వం చేయాలని కోరారు. ఇలాంటి పున‌శ్చ‌ర‌ణ తరగతులు అర్చక వ్యవస్థ పటిష్టానికి ఎంతో దోహ‌దం చేస్తాయన్నారు.

శ్వేత సంచాలకులు  భూమ‌న్‌ మాట్లాడుతూ ఇలాంటి పున‌శ్చ‌ర‌ణ తరగతుల ద్వారా అర్చకులు పాండిత్యాన్ని సంపాదించవచ్చ‌న్నారు. వైఖానస ఆగమంలోని నిగూఢ‌మైన విషయాలను తెలుసుకుని భక్తులు సంతృప్తి చెందేలా అర్చకత్వం చేయాల‌ని కోరారు. ఈ తరగతుల్లో ఆరోగ్య సూత్రాలపై కూడా శిక్షణ ఇస్తామన్నారు. పాంచ‌రాత్ర‌, శైవాగ‌మ అర్చ‌కుల‌కు కూడా పున‌శ్చ‌ర‌ణ త‌ర‌గతులు నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్