ఘర్షణ నేపధ్యంలో కేసులు నమోదు
Registration of cases in confrontational setting
సిద్దిపేట
సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు క్యాంప్ ఆఫీస్ లోకి అక్రమంగా ప్రవేశించి ఫ్లెక్సీ చింపివేసిన కాంగ్రెస్ కార్యకర్తలపై
సిద్దిపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిద్దిపేట ఏసీపీ మధు వివరించారు. కేసుల వివరాలు తెలియపరుస్తూ శుక్రవారం ఆర్ధరాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు అత్తు ఇమామ్, మమ్మద్ గౌస్ఉద్దీన్, నవాజ్ బాబా, మున్నా, నలుగురు కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ లోకి అక్రమంగా ప్రవేశించి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అని రాసి ఉన్న ప్లెక్సీ బోర్డును చింపివేసారు. ఎమ్మెల్యే పిఎ సురేష్ కుమార్ పిర్యాదు తో పోలీసులు కేసు నమోదు చేసారు. కాంగ్రెస్ కార్యకర్తలు మరియు టిఆర్ఎస్ కార్యకర్తలు ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పూర్తిస్థాయిలో చేయలేడని టిఆర్ఎస్ కార్యకర్తలు ప్లెక్సీలు కట్టిన విషయం తెలిసిందే. . రుణమాఫీ పూర్తిగా రెండు లక్షలు మాఫీ చేయడం జరిగింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పదవికి రాజీనామా చేస్తానని అప్పట్లో ప్రకటించినందున రాజీనామా చేయాలని నాలుగైదు ప్రదేశాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు. ఘర్షణ నేపధ్యంలో వన్ టౌన్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ బాబు సిబ్బందితో కలిసి ఇరువర్గాలను సామరస్యంగా మాట్లాడి ప్రజాశాంతికి భంగం కలిగించే చర్యలు చేపట్ట వద్దని హెచ్చరించారు.