- Advertisement -
పునరుధ్దరణ పనులు వేగవంతం
Renovation works are Speeding-up
మంత్రి
ఖమ్మం
గత రెండు రోజులుగా ఉమ్మడి ఖమ్మం,వరంగల్ జిల్లాలో. మున్నేరు ప్రాంతంలో అత్యధికంగా కనీవినీ ఎరుగని రీతిలో వరదలు వచ్చాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నదీ పరివాహక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రజలు నిరాశ్రయులయ్యారు. అధికారులు సహాయం అందించాలి అన్న ఖమ్మం నగరం జలదిగ్భందంలో చిక్కుకోవడం వల్ల ఇబ్బంది జరిగిందని అన్నారు. నిన్న మధ్యాహ్నం నుండి వర్షం లేకపోవడం వల్ల వారిని. కొంత సురక్షితంగా రిలీఫ్ క్యాంపులకు చెర్చం. హైదారాబాద్ నుండి. ,విశాఖ పట్టణం నుండి. ఒక హెలికాప్టర్ విజయవాడ వరకు వచ్చి కొంత అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ ఆలోచన విరమించుకున్నం. పాలేరు నియోజకవర్గం లో 2 గల్లంతయ్యారు చాలా బాధాకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయింత్రం ఖమ్మం పర్యటించే అవకాశం వుంది. వరద తగ్గడం వల్ల కొంత పునరుద్ధరణ కార్యక్రమం వేగవంతం చేస్తున్నాం. బురద తో పూడుకున్న రోడ్లు భవనాలు శుభ్రం చేయడం , విద్యుత్ సరఫరా పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాం . స్వచ్ఛంద సంస్థలు, సహృదయులు. వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బాధితులకు ఆహారం. నిత్యావసర వస్తువులు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలు మొత్తం కూడా పూర్తిగా కోలుకునే అంతవరకు సహకారం అందిస్తాం. రాష్ట్రంలోని. రోడ్లు. విద్యుత్ ,ఆరోగ్య అధికారులను ఖమ్మం పిలిచి ముఖ్యమంత్రి సమక్షంలో నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయిలో సహాయం ప్రకటిస్తారు. జిల్లాలోని మొత్తం ఫైర్ ఇంజన్లను కూడా ఖమ్మం. రమ్మని చెప్పా వారి ద్వారా రోడ్లు మొత్తం శుభ్రం చేస్తాం. హాండ్లుం శాఖకు పూర్తి స్థాయిలో వున్న స్టాక్ వివరాలు తీసుకొని ఖమ్మం పంపించమని చెప్పాం. కట్టు బట్టలు కోల్పోయిన నిరుపేదలకు. చెరకు ,దుపట్లు పంపిస్తాం. ఆహార పదార్థాలు ,నిత్యావసర వస్తువులు కూడా అందరికీ అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వరద సమయంలో సహకరించిన పత్రికా విలేకరులకు , యువకులకు , స్వచ్ఛంద సేవకులకు కృతజ్ఞతలని అన్నారు.,
- Advertisement -