34.8 C
New York
Saturday, June 22, 2024

రేవంత్ కుడా బీజేపీ లోకి వస్తాడు

- Advertisement -

రేవంత్ కుడా బీజేపీ లోకి వస్తాడు
జగిత్యాల
జగిత్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ నిజామాబాద్ ఎంపి అభ్యర్థి ధర్మపురి అర్వింద్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని విభజన చేసింది. కాంగ్రెస్ నాయకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లతున్నారు. 370 తీసేస్తం, త్రిబుల్ తలక్ తెస్తాం అంటున్నారు వక్స్ బోర్డు తీసేయాలి… సిఎఎ ను ఎందుకు విమర్శిస్తున్నారు. పాపులేషన్ తగ్గించే ప్రయత్నం చేయలేదు. దేశంలో ఒకే లా ( చట్టం) ఉండాలి దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదు. రాజ్యాంగ లో సెక్యులర్ పధం ఎందుకు పెట్టారు. మథుర లో శ్రీకృష్ణుని జన్మస్థలం లో దర్గా ఎందుకు కట్టారు. 70 సంవత్సరాలు ఏం చేశారు?? ఆరు గ్యారంటీ లు ఏమైనవని ప్రశ్నించారు.
మహిళలను మోసం చేస్తున్నారు. ఇస్లాం దేశాలు ఒకరిని మించి ఒకరు హిందు దేవాలయాలు కడుతున్నారు.  అబుదాబి కింగ్ రాముని గుడి కట్టాడు. మనమందరం జై శ్రీ రామ్ అంటున్నాము కానీ ఇస్లాం రాజు జై సీయాశ్రీరాం అని సీతా రామున్ని కలిపి  అంటున్నాడు. కాంగ్రెస్ లో నుండి ముఖ్య నాయకులు అందరూ వెళ్లిపోతున్నారు. అందరు బీజేపీ లోకి వస్తున్నారు ఆఖరికి రేవంత్ రెడ్డి కూడా వస్తాడు. రేవంత్ రెడ్డి కి లోపల హిందుత్వం ఉంది కానీ ఏం చేయలేక పోతున్నాడు. కాంగ్రెస్ వాళ్ళకి ఎజెండా నే లేదు. ప్రజలకు ఏం చేస్తామో, ఏమి హామీ ఇస్తారో చెప్పట్లేదు  ప్రజలను మాత్రం ఓట్లు  అడుగుతున్నారు. సీబీఐ నీ రాష్ట్రంలో ఎందుకు అలో చేయట్లేదు చెప్పాలి. ఆయుష్మన్ భారత్ కార్డులలో రాజీవ్ గాంధీ బొమ్మ లేదని అలో చేయట్లేదు. నిజామాబాద్ లో ప్రజలు జగిత్యాల జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారని అనుకావట్లేదు అందరూ ఆర్మూర్ జీవన్ రెడ్డి పోటీ చేస్తున్నారు అని  అనుకుంటున్నారు. నేను అడిగిన ప్రశ్నలకు కాంగ్రెస్ వాళ్లు సమాధానం చెప్పాలని అన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!