నిలిచిపోయిన రేవంత్ లిఫ్ట్…
హైదరాబాద్, ఏప్రిల్ 15
Revanth lift stopped...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‍లో లిఫ్ట్‌లో స్వల్ప అంతరాయం కలిగింది. సీఎం ఎక్కిన లిఫ్ట్‌లో అంతరాయం కారణంగా ఒక్కసారిగా నిలిచిపోయింది. 8 మంది ఎక్కాల్సిన లిఫ్ట్‌లో 13 మంది ఎక్కడంతో లిఫ్ట్ మొరాయించింది. సీఎం రేవంత్ ఎక్కిన లిఫ్ట్ ఓవర్ వెయిట్‌తో ఉండాల్సిన ఎత్తు కన్నా లోపలికి చొచ్చుకుపోయింది.ఘటనా స్థలిలో ఉన్న అధికారులు, సీఎం సహా ఆయన సిబ్బంది టెన్షన్ పడ్డారు. అసలు జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. కాసేపటికి తేరుకుని లిఫ్ట్ నుంచి అందరూ బయటకు వచ్చేశారు.హోటల్ సిబ్బంది, సీఎం సెక్యూరిటీ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. లిఫ్ట్ ఓపెన్ చేసి వేరే లిఫ్ట్‌లో సీఎంను సెకండ్ ఫ్లోర్‌కి తరలించారు. సీఎం రేవంత్‌కు ప్రమాదం తప్పడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.నోవాటెల్ హోటల్‌లో సీఎల్పీ సమావేశం సందర్భంగా సీఎం రేవంత్ అక్కడికి చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ విప్‌లు, ఎమ్మెల్యేలు సీఎంకు ఆహ్వానం పలికి నోవాటెల్ లోపలికి తీసుకెళ్లారు. హోటల్ పై అంతస్తకు వెళ్లే సమయంలో 8 మంది మాత్రమే ఎక్కాల్సిన లిఫ్ట్‌లో ఎక్కువ మంది ఎక్కారు.అందులో సీఎం రేవంత్ సహా 13 మంది ఉన్నారు. లిఫ్ట్ అధిక బరువు కారణంగా వెంటనే కిందికి కుంగిపోయింది. అలారం మోగిన వెంటనే అధికారులు, హోటల్ సిబ్బంది హుటాహుటిన లిఫ్ట్ వద్దకు చేరుకున్నారు. సీఎం సహా అందరిని లిఫ్ట్‌లో నుంచి బయటకు తీసుకొచ్చారు.