Friday, December 27, 2024

అల్లు అర్జున్.. రామ్ చరణ్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

- Advertisement -

అల్లు అర్జున్.. రామ్ చరణ్ పై రేవంత్ కీలక వ్యాఖ్యలు

Revanth's key comments on Ram Charan...Allu Arjun

హైదరాబాద్

సినీ పెద్దలతో సమావేశంలో రేవంత్ అల్లు అర్జున్ వ్యవహారం పై కీలక వ్యాఖ్యలు చేసారు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వం ఎలాంటి సహకారం కోరుకుంటుందో రేవంత్ వివరించారు. అదే విధంగా సినీ ఇండస్ట్రీకి ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. సినీ ఇండస్ట్రీ సమస్యల పరిష్కారం కోసం పరిశ్రమ నుంచి ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని.. పూర్తి నివేదిక తో కలవాలని సూచించారు. ఇక, అల్లు అర్జున్ తో పాటుగా రామ్ చరణ్ తో తనకు ఉన్న సంబంధాల గురించి రేవంత్ ఆసక్తి కరంగా చెప్పుకొచ్చారు.
రేవంత్ కీలక వ్యాఖ్యలు
సినీ పెద్దలతో ముఖ్యమంత్రి రేవంత్ నిర్వహించిన సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వం సినీ పెద్దల ముందు నిర్దిష్ట ప్రతిపాదనలు చేసింది. ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమాల్లో సినీ రంగం నుంచి ప్రాతినిధ్యం ఉండాలని సీఎం రేవంత్ స్పష్టం చేసారు. డ్రగ్స్ పైన చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగా ఎవరి పైనా కేసులు పెట్టటం లేదని రేవంత్ చెప్పారు. తమ ప్రభుత్వానికి ఐటీ, ఫార్మాతో పాటుగా సినీ రంగం కూడా ప్రధాన మైనదని చెప్పుకొచ్చారు. టాలీవుడ్ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తామని రేవంత్ ప్రకటించారు.
సినీ ప్రముఖులకు తేల్చి చెప్పిన సీఎం రేవంత్ నో కాంప్రమైజ్.!
రాం చరణ్ తో సంబంధాల పై
హైదరాబాద్ లో కాంక్లేవ్ ఏర్పాటు చేసి ప్రపంచ స్థాయి సినీ పరిశ్రమను ఆకట్టుకునే విధంగా ప్రణాళికలు సిద్దం చేయాలని కోరారు. అదే సమయంలో సినిమా ఈవెంట్స్ కు అనుమతి తప్పని సరి చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక, సంధ్యా థియేటర్ అంశంతో బెనిఫిట్ షోలు రద్దు.. టికెట్ ధరల పెంపు ఉండదని చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీ మేరకు ఇందులో మార్పు లేదని తేల్చి చెప్పారు. అదే సమయంలో అల్లు అర్జున్ గురించి రేవంత్ ప్రస్తావించారు. అల్లు అర్జున్, రామ్ చరణ్ ఇద్దరూ తనకు చిన్నప్పటి నుంచి తెలుసని. తనతో కలిసి ఉండేవారని రేవంత్ చెప్పుకొచ్చారు.
అల్లు అర్జున్ పై కోపం ఎందుకు,
అల్లు అర్జున్ పై తనకు ఎందుకు కోపం ఉంటుందని రేవంత్ ప్రశ్నించారు. తన వ్యక్తిగత అభిప్రాయాలు ఎలా ఉన్నా చట్టం ప్రకారం వ్యవహరించాలనేది తన విధానమని తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వం నుంచి సినీ పరిశ్రమకు పూర్తి సహకారం ఉంటుందని సీఎం స్పష్టం చేసారు. సినీ హీరో ల భద్రత కోసం వినియోగించే బౌన్సర్ల విషయంలో మాత్రం కఠినంగా ఉంటామని సీఎం రేవంత్ చెప్పారు. రాష్ట్రంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజాన్ని ప్రమోట్ చేయాలని కోరారు. టెంపుల్ టూరిజానికి సహకరించాలని సూచించారు. ప్రభుత్వం సగటు ప్రేక్షకుడిని దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తుందని వివరించారు. ప్రేక్షకుడికి అందుబాటులో సినిమా ఉండాలన్నారు. టికెట్ ధరలు ప్రేక్షకులు చూసే విధంగా ఉండాలని వ్యాఖ్యానించిన రేవంత్. ధరల పెంపునకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని టికెట్ ధరల పెంపుకు అవకాశం లేదని తేల్చేసారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్