Monday, January 13, 2025

ఇంతింతై… వటుడింతై…

- Advertisement -

ఇంతింతై… వటుడింతై…

So much... so much...

న్యూఢిల్లీ, డిసెంబర్ 27, (వాయిస్ టుడే)
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తుది శ్వాస విడిచారు. అనారోగ్యానికి గురైన మన్మోహన్ సింగ్ ను కుటుంబ సభ్యులు ఢిల్లీ ఎయిమ్స్ కు తరలించగా, చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. అయితే ఆర్థికవేత్తగా ప్రత్యేక గుర్తింపు పొంది, ప్రధానమంత్రిగా దేశానికి విశిష్ట సేవలు అందించిన మన్మోహన్ జీవితంలో ఎన్నో చెరగని పేజీలు ఉన్నాయి.పంజాబ్‌ ప్రావిన్స్‌ లో సెప్టెంబర్ 26, 1932న మన్మోహన్ సింగ్ జన్మించారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ జన్మించిన ప్రాంతం పాకిస్థాన్లో ఉండడం గమనార్హం. దేశ విభజన తర్వాత కుటుంబంతో సహా మన్మోహన్ కుటుంబం భారతదేశానికి వలస వచ్చింది. మన్మోహన్ సింగ్ బాల్యంలోనే తన తల్లిని కోల్పోయారు. మన్మోహన్ సింగ్ ఆలనాపాలనా ఆయన అమ్మమ్మ చూసుకొనేవారట.మన్మోహన్ సింగ్ బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. కనీసం కరెంట్ కూడా లేని గ్రామంలో, దీపం వెలుగులోనే చదువుకునే వారట. మన్మోహన్ సింగ్ అమృత్సర్లోని హిందూ కళాశాలలో చదివారు. ఆ తర్వాత పంజాబ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్, మాస్టర్స్ పొందారు. అంతేకాదు కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుండి తన ఎకనామిక్స్ ట్రిపోస్ చేసి, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి DPhil చదివారు.మన్మోహన్ 1966 నుండి 1969 వరకు యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్‌మెంట్ కోసం పనిచేశారు. లలిత్ నారాయణ్ మిశ్రా సహకారంతో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా కూడా పనిచేశారు. 1972లో మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య సలహాదారుగా, 1976లో ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.1982లో మన్మోహన్‌ సింగ్‌ ఆర్‌బీఐ గవర్నర్‌గా కూడా నియమితులయ్యారు. 1985 నుండి 1987 వరకు భారత ప్రణాళికా సంఘం డిప్యూటీ ఛైర్మన్‌గా ఉన్నారు. ఆసమయంలో 1987లో సింగ్‌కు పద్మవిభూషణ్ అవార్డు ఆయనకు వరించింది. 1991లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. తర్వాత 1991 జూన్‌లో పీవీ నరసింహారావు మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు.మన్మోహన్ సింగ్ 1991లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. మరలా 1995, 2001, 2007 మరియు 2013లో తిరిగి రాజ్యసభకు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పాలనలో మన్మోహన్ సింగ్ మే 22, 2004న భారతదేశ 14వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రెండు దఫాలుగా పదేళ్లు ప్రధానమంత్రిగా మన్మోహన్ దేశానికి సేవలు అందించారు. 2002లో ఆయనకు అత్యుత్తమ పార్లమెంటరీ అవార్డును కూడా మన్మోహన్ అందుకున్నారు. అంతేకాదు మన్మోహన్ సింగ్ ‘ప్రపంచంలోని టాప్ 100 ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా తన ముద్రను వేసుకున్నారు.దేశ విభజన సమయంలో, అతను ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు, తన తండ్రితో కలిసి పాకిస్తాన్‌ను విడిచిపెట్టి భారతదేశానికి రావాల్సి వచ్చింది.భారత ప్రధానిగా ఉన్నప్పుడు, అతను ఒకసారి పాకిస్తాన్ వెళ్లాలని అనుకున్నారని రాజీవ్ శుక్లా తెలిపారు. తాను పెరిగిన గ్రామాన్ని చూడాలనిపించింది. అతను ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలను చూడాలనుకున్నాడు. ఒకసారి నేను ఆయనతో కలిసి ప్రధాని హౌస్‌లో సంభాషణ సమయంలో అతను పాకిస్తాన్ వెళ్లాలని కోరిక ఉందని మన్మోహన్ చెప్పారని రాజీవ్ శుక్లా తెలిపారు. మీ పూర్వీకుల ఇంటిని చూడాలనుకుంటున్నారా అని రాజీవ్ శుక్లా అడిగినప్పుడు, మన్మోహన్ సింగ్ బదులిచ్చారు, తన ఇల్లు చాలా కాలం క్రితం పూర్తయింది. తాను 4వ తరగతి వరకు చదివిన పాఠశాలను చూడాలని ఉందని చెప్పారన్నారు. అయితే, అతను తన ప్రాథమిక విద్యను అభ్యసించిన పాఠశాలను చూసే అవకాశం అతనికి ఎప్పుడూ లేదు. కానీ అతను పాకిస్తాన్‌లోని గాహ్ గ్రామంలో చదివిన పాఠశాలను ఇప్పుడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వ బాలుర పాఠశాలగా మార్చేశారు.అదే గాహ్ గ్రామంలో నివసించిన రాజా మహ్మద్ అలీ, మన్మోహన్ సింగ్ క్లాస్‌మేట్ అని, తాను నాలుగో తరగతి వరకు మన్మోహన్‌తో కలిసి చదువుకున్నట్లు మీడియా కథనంలో పేర్కొన్నారు. తర్వాత మన్మోహన్ సింగ్ చదువుల కోసం చక్వాల్ పట్టణానికి వెళ్లారు. దేశ విభజన తర్వాత ఆయన కుటుంబం ఇండియాకు వెళ్లిపోయింది. కానీ నేటికీ గాహ్ గ్రామ ప్రజలు ఆయనను గుర్తుంచుకుంటారు.
ఐక్యరాజ్యసమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారి
1966 నుంచి1969 వరకు ఐక్యరాజ్యసమితిలో వాణిజ్య వ్యవహారాల అధికారిగా పనిచేశారు. 1969 నుంచి 1971 మధ్య ఢిల్లీ వర్సిటీ, అంతర్జాతీయ వాణిజ్యంలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. 1972-76 ఆర్థికశాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఉన్నారు. 1976 నుంచి 1980 వరకు రిజర్వు బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశారు. ఐడీబీఐ డైరెక్టర్‌, ఆసియా అభివృద్ధి బ్యాంకు భారత్‌ విభాగం గవర్నర్‌, ఐబీఆర్‌డీ భారత విభాగం గవర్నర్‌గా మన్మోహన్‌ సేవలందించారు. 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్‌గా పనిచేశారు మన్మోహన్‌ సింగ్. 1985-87 మధ్య కాలంలో ప్రణాళికా సంఘం అధిపతిగా పనిచేశారు మన్మోహన్ సింగ్.
తొలిసారి రాజ్యసభలో అడుగు
అక్టోబర్‌ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు మన్మోహన్ సింగ్. 1991 నుంచి 1996 వరకు పీవీ నరసింహారావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మన్మోహన్ సింగ్. 1998 నుంచి 2004 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఐదుసార్లు అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు మన్మోహన్ సింగ్.
13వ భారత ప్రధానిగా బాధ్యతలు
2004లో సార్వత్రిక ఎన్నికల్లో యూపీఏ కూటమి గెలిచాక 13వ భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు మన్మోహన్ సింగ్‌. 2004 నుంచి 2014 వరకు రెండుసార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. పదేళ్ల పాటు సుదీర్ఘకాలం ప్రధానమంత్రిగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులు వేశారు . ప్రధానిగా రోజుకు 18 గంటలు పనిచేశారు మన్మోహన్‌ సింగ్. పార్లమెంటు సభ్యుడిగా దాదాపు 33 ఏళ్ల పాటు కొనసాగారు. ఆరోగ్యం సహకరించని పరిస్థితుల్లోనూ కీలక సమయాల్లో ఓపిగ్గా సభకు వచ్చి అందరిలోనూ స్ఫూర్తి నింపారు మన్మోహన్ సింగ్.
పద్మ విభూషణ్‌ అవార్డు
1987లో మన్మోహన్‌ సింగ్‌ పద్మ విభూషణ్‌ అవార్డు అందుకున్నారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి, 1993, 94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు అందుకున్నారు. 2010లో మన్మోహన్‌ సింగ్‌ను వరల్డ్‌ స్టేట్స్‌ మెన్‌ అవార్డు వరించింది. ఫోర్బ్స్‌ అత్యంత శక్తివంతుల జాబితాలోనూ మన్మోహన్‌కు చోటు దక్కింది.మన్మోహన్ సింగ్ మృతితో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలన్నీ రద్దు చేసింది కేంద్రం. ప్రభుత్వ లాంఛనాలతో మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్