- Advertisement -
రేవంత్ భాష, పద్దతి మార్చుకోవాలి
Revanth's language and methodology should be changed
హైదరాబాద్
ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ,కాలేరు వెంకటేష్ ,బీ ఆర్ ఎస్ నేత స్వామి యాదవ్ శనివారం మీడియాతో మాట్లాడారు.
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మూసీ ప్రక్షాళన పేరుతో బజారు భాష మాట్లాడుతున్నారు. మూసీ నది ప్రక్షాళన స్టార్ట్ చేసింది బిఆర్ఎస్ పార్టీ. బిఆర్ఎస్ అడ్డుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం దురదృష్టకరం. మూసీ నది అభివృద్ధి పేరుతో నిర్వాసితులకు నష్టం జరగొద్దని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.
నల్గొండ జిల్లా రైతులను సీఎం రేవంత్ రెడ్డి రెచ్చగొడుతున్నారు. కేటీఆర్ హైదరాబాద్ నగరంలో 32 ఎస్టీపీలను నిర్మించారు. దాదాపు 8 ఎస్టీపీల నిర్మాణం పూర్తి అయింది. మూసీ అభివృద్ధి చైర్మన్ గా నన్ను నియమించి కేసీఆర్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు.
సీఎం రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. అర్ధరాత్రి పోలీసులను పంపి ఇళ్లను ఖాళీ చేయాలని ప్రభుత్వం పేదలపై ఒత్తిడి తెస్తోంది. మూసీ నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్యాకేజీ అమలు చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి భాష, పద్దతి మార్చుకోవాలి. మూసీ నిర్వాసిత ప్రజలకు నష్ట పరిహారం ఇవ్వాలని బుల్డోజర్లకు అడ్డం పడతామని బిఆర్ఎస్ చెప్పింది. పేదలకు నష్టం జరగకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం మూసీని అభివృద్ధి చేసిందని అన్నారు. టెండర్లు కాకుండా లక్షా 50 వేల కోట్లు అని సీఎం ఎందుకు చెప్పారు.
సినిమా మేము చూపెడతామా. రేవంత్ రెడ్డి చూపెడతాడో చూద్దాం. కాంగ్రెస్ పార్టీకి టచ్ లోకి వెళ్లిన వాళ్ళు మాతో టచ్ లో ఉన్నారు. సీఎం ప్రజలకు రోల్ మోడల్ గా ఉండాలి. రేవంత్ రెడ్డి సంస్కారవంతమైన భాష మాట్లాడాలి. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఎన్ని అమలు చేసిందో ప్రజలకు తెలుసు. రుణమాఫీ ఎంతమంది రైతులకు అయిందో తెలుసు. మూసీ నది ఒడ్డుకు ఉన్న వాళ్ళు దినదినగండంతో బతుకుతున్నారు. మూసీలో మురికి నీరు లేకుండా ఉండటం కోసం ఎస్టీపీల నిర్మాణం జరిగింది. నల్గొండ రైతుల కోసమే 3 వేల కోట్లతో ఎస్టీపీల నిర్మాణం చేశామని అన్నారు.
- Advertisement -