అప్పుల రాష్ట్రంగా మారిన  ధనిక తెలంగాణ :రామచందర్ రావు

- Advertisement -

అప్పుల రాష్ట్రంగా మారిన  ధనిక తెలంగాణ
     బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు
హైదరాబాద్ ఫిబ్రవరి 5

Rich Telangana has become a debt-ridden state: Ramachandra Rao
ధనిక తెలంగాణ అప్పుల రాష్ట్రంగా మారిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. బిఆర్ఎస్ ఎన్ని స్కామ్ లు చేసిందో తెలంగాణ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ను అడిగితే చాలు అని అన్నారు. ‘సేవ్ తెలంగాణ-ఓట్ ఫర్ బిజెపి’ అనే నినాదంతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ‘సేవ్ తెలంగాణ’ పేరుతో పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా బిజెపి కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ స్కాముల గురించి మంత్రులను అడిగాలని అన్నారు. ప్రజల ధనాన్ని కాంగ్రెస్ పాలకులు దోచుకుంటున్నారని, మున్సిపాల్టీలపై రూ.3,600 కోట్ల అప్పు ఉందని విమర్శించారు. తెలంగాణలో ట్యాక్స్ టెర్రరిజం రాజ్యం ఏలుతోందని, ఫ్రీ బస్సు అని చెప్పి.. డొక్కు బస్సులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండేళ్లలోనే రూ.80 వేల కోట్లు అప్పు చేశారని రామచందర్ రావు పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular