- Advertisement -
సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అవుతున్న రోజా..
Roja is getting ready for the second innings..
చెన్నై, డిసెంబర్ 14, (వాయిస్ టుడే)
తెలుగు రాజకీయాల్లో నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజా అంటే ఫైర్.. ఫైర్ అంటే రోజా అన్నట్లు వ్యవహరించారు. ప్రత్యర్థులపై ఆమె చేసే విమర్శలు అంత ఘాటుగా ఉంటాయి. ఏ అంశంలోనైనా ప్రత్యర్థుల్ని ఏకిపారేయడం రోజా స్టైల్. నగరి నుంచి వరుసగా రెండుసార్లు గెలిచిన రోజా ఆ నియోజకవర్గం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గాలి భాను చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు.మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో రోజా భర్త, సోదరుల పెత్తనం పెరిగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తినా ఆమె పట్టించుకోలేదు. చంద్రబాబు, లొకేష్, పవన్ లపై మితిమీరిన విమర్శలు, సొంత పార్టీలో వ్యతిరేక కుంపటి, మంత్రి అయ్యాక హంగు ఆర్భాటం, విలాసవంతమైన జీవితం, విదేశీ ప్రయాణాలు.. ఇవే రోజాకు ప్రస్తుతం శాపాలుగా మారాయి. ఆ ప్రభావంతో గత ఎన్నికలలో సూమారు 45 వేల ఓట్లతో ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల తరువాత ఏపీఐసీసీ చైర్మన్ గా, మంత్రిగా రోజాల చేసిన అక్రమాలతో పాటు, నియోజకవర్గం జరిగినా అవినీతిపై విచారణ కోరుతూ పెద్ద ఎత్తున కూటమీ నేతలు సిఐడి కు ఫిర్యాదు చేశారు.ఆ క్రమంలో ఆడుదాం ఆంద్ర, నగరిలో భూ అక్రమాలు, టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి స్థలాలకు సంబంధించి కోట్ల రూపాయల అవినీతిపై సీఐడీ లోతుగా విచారణ జరుపుతుందట. ఆ ప్రభావంతో ఎన్నికల తరువాత అప్పుడప్పుడు తిరుపతి జిల్లాలో తళుక్కుమన్న రోజా గత కొంత కాలంగా అసలు ఇటు వైపు చూడటమే మానేశారు. ఆమె చెన్నై, హైదరాబాదుల్లోనే ఎక్కువగా ఉంటున్నారు.సీఐడీ విచారణలతో రాజకీయంగా ఇబ్బందులు తప్పదని ఫిక్స్ అయిన అమె ఇప్పుడు రూట్ మార్చినట్లు టాక్ నడిస్తోంది.రోజా ఓడిపోయాక గతంలోలా పెద్దగా వాయిస్ వినిపించడం లేదు. అప్పుడప్పుడు ఏఫీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎక్స్ వేదికగా మాత్రమే పోస్టులు పెడుతూ ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి సంబంధించి రోజా పెట్టిన ట్వీట్‌పై నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఘాటుగా స్పందించారు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్‌కు.. మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండని భాను నిలదీయడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.రోజా బెంజికారు ఎపిసోడ్ వైరల్‌గా మారడంతో .. లేనిపోని తలనొప్పులు ఎందుకని రోజా ట్వీట్ లు పెట్టడం కూడా తగ్గించేశారు. పార్టీ ఆదేశిస్తే తప్ప తనుకు తానుగా బయటకు వచ్చి స్పందించడం మానేశారు. ట్వీట్లు సైతం పార్టీ పంపితే పెడుతూ సైలెంట్ గా ఉంటున్నారంట. ఈమధ్య షర్మిల సైతం రోజా పెడుతున్న పోస్టులు అమెవీ కాదని వైసీసీ సోషల్ మీడియా చేస్తున్న పనే అని ఆరోపించారు.ఏదేమైనా మున్నుందు దూకుడుగా వెళితే ఇబ్బందులు అని తెలిసే రోజా మౌనంగా ఉంటున్నారనే టాక్ వైసీపీలో నడుస్తోంది. అందుకే పొలిటికల్ హీట్ నుండి తప్పించుకోవడానికి సినిమాల వైపు చూస్తున్నారట రోజా.. తాను క్యారెక్టర్ రోల్స్ చేయడానికి రెడీ అంటూ తన టీమ్ ద్వారా టాలీవుడ్‌లోని పలువురు దర్శకులకు, తమిళ సినిమా నిర్మాతలకు సంకేతాలు పంపిస్తున్నారంట. నిజానికి రాజకీయాల వల్ల సినిమాలకి గుడ్ బై చెప్పారు కానీ ఒకప్పుడు క్యారెక్టర్ రోల్స్‌తో టాలీవుడ్‌లో, టీవీ షోల్లో రోజా బిజీగానే ఉన్నారు.2013లో ఆమె టాలీవుడ్‌కి గుడ్‌బై చెప్పారు. అప్పటి నుండి ఫుల్ టైమ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కానీ బుల్లితెరపై జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు, పలు ఫెస్టివల్ ఈవెంట్స్‌లో మాత్రం పాల్గొంటూ వచ్చారు .. మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లితెరకి కూడా బైబై చెప్పేశారు. అయితే ఇటీవల జబర్దస్త్ కాకుండా ఎదైనా షోలో అవకాశం ఇస్తే చేస్తానని ఆమె ప్రకటించారు. మొన్నీమధ్య కేసీఆర్ అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఫంక్షన్‌కి గెస్ట్‌గా రావడం, పుష్ప సినిమాను అద్భుతంగా ఉందంటూ పొగడటం లాంటివి స్క్రీన్‌పై రీఎంట్రీ ఇవ్వడానికే అంటున్నారు.అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెకు అవకాశాలు ఎంత ఎవరకు వస్తాయో అనేది డౌటే అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. డిప్యూటీ సిఎంగా పవన్ ఉండటం, తాజాగా నాగబాబుకు మంత్రి గా అవకాశం రావడంతో.. చిరంజీవి నుండి పవన్ వరకు అందరి పైన తీవ్రస్థాయి విమర్శలు చేసిన రోజాకు సినిమా ఇండస్ట్రీ నుంచి ఏ మేరకు మద్దతు లభిస్తుంది అన్నది అనుమానంగానే మారింది .. మరి టాలీవుడ్‌లో తిరిగి మేకప్ వేసుకోవాలనుకుంటున్న రోజా కోరిక తీరకపోతే.. ఆమె తమిళ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయిపోతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
- Advertisement -