ఇంతటి దౌర్భాగ్య పాలన ఎక్కడా చూడలే…..!
కెసిఆర్ ను గద్దె దించడమే తెలంగాణ జన సమితి లక్ష్యం
ప్రొఫెసర్ యం.కోదండరాం
జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో నేడు పాలకులు మారాలి – పాలనా తీరు మారాలి అని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఉద్యమాల రథసారథి ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శనివారం జగిత్యాల పట్టణంలోని దేవిశ్రీ గార్డెన్స్ లో జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి అధ్యక్షతన తెలంగాణ జన సమితి కార్యకర్తల, అభిమానుల, ఉద్యమ కారుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రోఫెసర్ కోదండరాం మాట్లాడుతూ యావత్ భారత్ దేశ చరిత్రలో ఇంతటి దౌర్భాగ్య పాలన ఎక్కడా చూడలే…..! అని ఆవేదన వ్యక్తం చేశారు.
కెసిఆర్ ను గద్దె దించడమే తెలంగాణ జన సమితి లక్ష్యం అని ఆయన నొక్కి వ్యాఖ్యానించారు. కెసిఆర్ ను ఒడిస్తే తప్పా ఆయన అహంకారం అంగదని, రాష్ట్రంలో విచ్చల విడి దోపిడీ నిలిచిపోదు అని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ఆయన పలు సదర్భాలను వివరించారు.
తెలంగాణ ప్రజలకు సరైన న్యాయం జరుగాలన్నా, నిరుద్యోగ సమస్య తీరాలన్నా, ఇతర ఏ సమస్య పరిష్కారం కావాలన్నా కెసిఆర్ ఓటమి పాలైతే తప్పా సాధ్యం కాదు అన్నారు. అందరం పోటీ చేస్తే ఓట్లు చీలి తెలంగాణ దోపిడీ దారులే మళ్లీ గెలువద్దని మేము జన సమితి ద్వారా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు వారితో పూర్తి స్థాయిలో కలిసి మద్దతు తెలుపడం, కాంగ్రెస్ గెలుపు కు కృషి చేయడం జరుగుతుందని వివరించారు.
ఉద్యమ ఆకాంక్షలు, తెలంగాణ అమరవీరుల ఆశయాల సాధన కోసమే కృషి చేస్తామని తెలిపారు. పదేండ్ల పాలన వైఫల్యాలు, దోపిడీ, ప్రభుత్వ – పాలకుల నిర్లక్ష్యం, నిర్బంధాలు, అక్రమాలు, అవినీతి, అరాచకాలు తెలంగాణ ప్రజలకు పూర్తిగా అర్థమైపోయాయని తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి కోరుట్ల, ధర్మపురి నియోజక వర్గాల ఇంచార్జ్ లు కంతి మోహన్ రెడ్డి రెడ్డి, రామగిరి సంతోష్, జగిత్యాల పట్టణ ఇంచార్జి అల్లెంకి శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా నాయకులు బొజ్జ కనకయ్య,, సందేశ్, జహంగీర్, తరుణ్, ప్రముఖ న్యాయవాదులు, ఉద్యమ నాయకులు బండ భాస్కర్ రెడ్డి, రాచకొండ శ్రీరాములు, గోవిందుల రాజన్న, ముద్దం ప్రభాకర్, డాక్టర్ ముస్కు గంగారెడ్డి, బండ శంకర్, పేట భాస్కర్, పోగుల రాజేశం, రాజన్న, చాంద్ పాషా, కొండ్ర జగన్, మైనార్టీ నాయకులు ఖాజా మీర్ అలీ, శరీఫోద్దిన్, విశాల్, పడకంటి లక్ష్మి నారాయణ, పొన్నం రాజమల్లు, కడ రాజన్నలతో పాటు ఉద్యమకారులు, నిరుద్యోగులు, తెలంగాణ జన సమితి కార్యకర్తలు తదితులు పాల్గొన్నారు.