- Advertisement -
ఆపిల్ కిడ్స్ పాఠశాలలో సావిత్రిబాయి జయంతి
Savitribai Jayanti at Apple Kids School
కమాన్ పూర్
కమాన్ పూర్ మండల కేంద్రంలోని
ఆపిల్ కిడ్స్ పాఠశాలలో ఘనముగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
శుక్రవారం ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే 194వ జయంతి సందర్భంగా ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి ఘనముగా జయంతి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చదువు వెంకటరెడ్డి మాట్లాడుతూ ఆడపిల్లల చదువు కోసం, నిరంతరం పాటుపడిన మహిళ చైతన్య మూర్తి, సమాజంలో రుగ్మతల రూపుమాపేందుకు కృషి చేసిన సంఘసంస్కర్త, దేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు చదువుల తల్లి,అని విద్యార్థి విద్యార్థులకు తెలియపరిచారు ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో మహిళ ఉపాధ్యాయురాలను పాఠశాల కరస్పాండెంట్ ఘనంగా సన్మానించారు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ రాజమణి మాట్లాడుతూ మహిళలు అందరూ అన్ని రంగాల్లో ముందుకు రావాలని తెలియజేశారు మాకు ఈ టీచర్ మృతి ఎంతగానో తృప్తినిస్తుందని దీనికి కారణం సావిత్రిబాయి పూలే అని వారు ఆమె చేసినటువంటి సేవలను కొనియాడారు ఇందులో భాగంగా పాఠశాల ఉపాధ్యాయురాలు భూలక్ష్మి గౌతమి జేబా ఫౌజీయ చామంతి రజిత పాల్గొన్నారు.
- Advertisement -