- Advertisement -
బాల అకాడమీ పాఠశాలలో సావిత్రిబాయి పూలే జయంతి
Savitribai Phule Jayanti at Bala Academy School
నంద్యాల
స్థానిక నంద్యాల జిల్లాలోని పార్కు రోడ్డు సమీపంలో గల బాల అకాడమీ పాఠశాలలో శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతిని జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాఠశాల కరస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత విచ్చేసి మాట్లాడుతూ ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళ ఉపాధ్యాయురాలు, స్త్రీల విద్యాభివృద్ధికి కృషిచేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి, భారతీయ సంఘసంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి మరియు కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి సావిత్రిబాయి పూలే 1831 వ సంవత్సరం జనవరి 3 వ తేదీన జన్మించింది ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యమని నమ్మి తన భర్తతో కలిసి 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించి నూతన వ్యవస్థ కోసం ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమిష్టిగా పోరాటం చేశారని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ ఎం.జి.వి. రవీంద్రనాథ్ ప్రిన్సిపల్ మాధవీలత మరియు పాఠశాల ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -