- Advertisement -
ఎంఆర్సి లో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
Savitribai Phule Jayanti celebrated in MRC
మంథని
తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని పురస్కరించుకొని మంథని మండల విద్యా వనరుల కేంద్రంలో ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. మండల విద్యాధికారిణి దాసరి లక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ జయంతి ఉత్సవాల సమావేశంలో పలువురు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొని సావిత్రిబాయి పూలే కు ఘనమైన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి లక్ష్మి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే యావత్ తెలుగు సమాజానికే కాకుండా భారత దేశంలోని మహిళలకు విద్య అవసరం యొక్క ఆవశ్యకతను వివరించిన ప్రచారం చేసిన మహామనిషి అని, ఆమె కృషి వల్లనే అట్టడుగు వర్గాల మహిళల కు విద్య ఫలాలు అందాయని అన్నారు. అట్టి మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకొని నేటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా మహిళ ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలల్లోని బడుగు బలహీన వర్గాల తోపాటు అన్ని సామాజిక వర్గాల విద్యార్థినీ విద్యార్థుల యొక్క విద్యాభివృద్ధికి కృషి చేయాలని, అట్టి కృషిలో తమ వంతు పాత్రను నిర్వహించి ఈ సమాజం ముందుకు వెళ్లేలాగా తోడ్పాటు అందించాలని కోరారు. ఇట్టి వారి గొప్ప కృషికి అధికార యంత్రాంగం తరపున తాము కూడా అవసరమైన సహాయ సహకారాలు అందించి సమాజాభ్యున్నతిలో పాలుపంచుకుంటామని హామీ ఇచ్చారు. ఇట్టి కార్యక్రమంలో టి ఎస్ టి యు జిల్లా అధ్యక్షుడు బహుత్ కిషోర్, పి.ఆర్.టి.యు మండల అధ్యక్షుడు ఎర్రం రమేష్, ఇతర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -