- Advertisement -
హైదరాబాద్:ఆగస్టు 17: సీనియర్ జర్నలిస్టు సీహెచ్‌వీఎం కృష్ణారావు కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు పత్రికా రంగంలో కొనసాగిన ఆయన అనేక సంస్థల్లో పనిచేశారు. బాబాయ్‌గా రాజకీయ వర్గాల్లో పేరు పొందారు. ఆయన మరణవార్త తెలిసిన రాజకీయ ప్రముఖులు, పలు మీడియా సంస్థలు సంతాపం తెలుపుతున్నాయి…
- Advertisement -