- Advertisement -
పాకిస్థాన్ లో తీవ్ర భూకంపం ..రిక్టర్ స్కేలే పై 5.8 తీవ్రత నమోదు
Severe earthquake in Pakistan .. 5.8 magnitude on the Richter scale వణికిన ఉత్తర భారతం
న్యూ డిల్లీ సెప్టెంబర్ 11
;పాకిస్థాన్ లో బుధవారం మధ్యాహ్నం 12:58 గంటల సమయంలో 5.8 తీవ్రతతో భూమి కంపించింది. పెషావర్, ఇస్లామాబాద్, లాహోర్లో కూడా ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంపం కేంద్రం పాకిస్థాన్లోని కరోర్కు నైరుతి దిశలో 25 కిలోమీటర్ల దూరంలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది.ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతదేశంలోనూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతం (Delhi – NCR), ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కశ్మీర్లోనూ భూమి కంపించినట్లు పేర్కొంది. అయితే తేలికపాటి ప్రకంపనలే కావడంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు. అటు ఆఫ్ఘనిస్థాన్లోనూ భూమి కంపించినట్లు నేషనల్ మీడియా వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, కార్యాలయాల నుంచి బయటకు పరుగులు తీశారు.
- Advertisement -




