ముధోల్ లో రురల్ మార్కెట్ వార సంత కొరకు షెడ్ శాంక్షన్
==========================
ఎన్నోఏళ్లుగా ముధోల్ లో రైతుబజార్ ఏర్పాటుకు ఎదురుచూస్తున్న ముధోల్ వాసులకి శుభవార్త. ముధోల్ లోని వారసంత అంగడిబజార్ లో వ్యాపారం చేసే వారికీ మరియు మహిళలకి వర్షాకాలం లో వర్తకం చేయుటకు , పార్కింగ్ , కూరగాయలు అమ్మేవారికి, కొనేవారికి ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా సెంటర్ ఫర్ రురల్ డెవలప్ మెంట్ స్వచ్చంద సంస్థ ద్వారా NABARD ఆర్థిక సహకారం తో ముధోల్ లో గ్రామీణ సంత రురల్ మార్కెట్ నిర్మాణానికి గ్రామ పంచాయతీ అభ్యర్థనమేరకు Center for rural development ద్వారా NABARD నుంచి ఆమోదం లభించుటలో
DRDO PD విజయలక్ష్మి ప్రత్యేక చొరవ చూపించారు.
ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ చేతులమీదుగా CRD నిర్మల్ జిల్లా బాద్యులు కిరణ్ కుమార్ , PO రాజు ఇట్టి రురల్ మార్కెట్ శాంక్షన్ పత్రాన్ని ముధోల్ సర్పంచ్ రాజేందర్ కి అందించారు. త్వరలో నిర్మాణ పనులని మొదలుపెట్టి మార్కెట్ షెడ్ తో పాటుగా , మరుగుదోడ్లు పార్కింగ్ , ఇతరత్రా వసతులు ప్రజలకి మార్కెట్ ని అందుబాటులోకి తేవడంజరుగుతోందని తెలిపారు. రురల్ మార్ట్ ముధోల్ లో ఏర్పాటుకు నాబార్డ్ నిధులు లభించటం సంతోషంగా ఉంది అని సర్పంచ్ రాజేందర్ తెలిపారు.