- Advertisement -
లేని బకాయిలు చూపిస్తున్నారు
Showing non-existent dues
ఆళ్లగడ్డ
విజయ పాల డైరీ లో ఆళ్లగడ్డ టిడిపి యువ నాయకుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.
చాగలమర్రి మండలం చక్రవర్తుల పల్లెలో విజయ పాల డైరీ కి ఐదు సంవత్సరాలుగా నేను నామినేషన్ వేస్తున్నాను. ఇన్ని రోజులు చూపించని బకాయిలు ఈరోజు ఎందుకు చూపిస్తున్నారు. ఏదైనా బకాయిలు ఉంటే పేపర్లు తీసుకొని వచ్చి ఎందుకు చూపించలేకపోతున్నారి అయన ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో వైయస్ జగన్మోహన్ రెడ్డిని అడ్డుపెట్టుకొని రెండు సంవత్సరాలు ప్రెసిడెంట్ గా లేకున్నా కూడా అధికార యంత్రాంగం అంతా అడ్డుపెట్టుకొని చైర్మన్ అవడం జరిగింది. ఇవన్నీ నేను బయట పెడతానని ఉద్దేశంతో ఈరోజు బకాయి ఉందంటునారు. సొసైటీ రద్దు అవ్వదు మేము కోర్టుకు వెళ్లడం జరిగింది అలాగే నాకు బకాయిలు ఉంటే ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
డైరెక్టర్ల మీటింగ్ జరిగితే అది నంద్యాల లోనైనా జరగాలి లేకుంటే కర్నూల్ లో అయినా జరగాలి ఈ రెండు చోట్ల లేకుండా చైర్మన్ జగన్ మోహన్ రెడ్డి ఇంట్లో డైరెక్టర్ల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మా తరఫున నలుగురు డైరెక్టర్లు ఉన్న వారికి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మీటింగ్ ఎలా జరిపారని అడిగారు.
- Advertisement -