Thursday, January 15, 2026

SLV సినిమాస్ సినిమా గ్రాండ్ గా లాంచ్ – 2026 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ సినిమా గ్రాండ్ గా లాంచ్ – 2026 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్

SLV Cinemas Movie Grand Launch - Release in Theaters for Sankranthi 2026

ఎలక్ట్రిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఎఫర్ట్ లెస్ యాక్టింగ్, అద్భుతమైన కామిక్ టైమింగ్ తో అలరించే మాస్ మహారాజా రవితేజ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ల మాస్టర్, దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి RT76 ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. క్యాలిటీ, హై ఎంటర్ టైన్మెంట్ వాల్యూస్ తో సినిమాలని అందించడంలో పాపులరైన ప్రతిష్టాత్మక SLV సినిమాస్ బ్యానర్‌పై సక్సెస్ ఫుల్ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
క్రేజీ కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రం ఈరోజు ముహూర్తపు వేడుకతో ఘనంగా ప్రారంభమైంది.
దర్శకుడు కిషోర్ తిరుమల, రవితేజ సిగ్నేచర్ స్టయిల్, కామెడీతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని రాశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ కథలో రవితేజ తనదైన ఎనర్జీతో అలరించనున్నారు.
అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రవితేజ వెరీ స్టైలిష్ అవతార్‌లో, డిజైనర్ సూట్ ధరించి కనిపిస్తున్నారు. ఎయిర్‌క్రాఫ్ట్ సీటులో హాయిగా కూర్చున్న అతను, ముందు సీటుపై ఒక కాలు క్యాజువల్‌గా ఆనించి, ఒక చేతిలో వైన్ బాటిల్, మరో చేతిలో పుస్తకంతో కనిపించడం అదిరిపోయింది. ఇది ఇప్పటివరకు రవితేజ మోస్ట్ స్టైలిష్ లుక్‌ను సూచిస్తుంది. అతను పట్టుకున్న పుస్తకంలో “సీ ఇట్ & సే ఇట్” స్పానిష్‌లో ఉంది, ఇది అతని పాత్రపై ఆసక్తిని పెంచుతోంది.
ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. బ్లాక్‌బస్టర్ ధమాకా కోసం చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించిన తర్వాత భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి రవితేజతో మళ్ళీ వర్క్ చేస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల డీవోపీగా పని చేస్తున్నారు. అవార్డ్ విన్నింగ్ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. AS ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్.
RT76 రెగ్యులర్ షూటింగ్ జూన్ 16 నుండి హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. ఈ చిత్రం 2026 సంక్రాంతికి థియేటర్లలో రిలీజ్ కానుంది.
తారాగణం: రవితేజ

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్