చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులలో వేగం పెంచాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
Small Kaleshwaram project work should be speeded up :
చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి,
చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులలో వేగం పెంచి రైతులకు అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శుక్రవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో చిన్న కాళేశ్వరం పనుల పురోగతిపై ఇరిగేషన్, విద్యుత్, రెవెన్యూ, మేఘ కంపనీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ
చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులలో వేగం పెంచాలని వీరపూర్ చెరువు, మందిరం చెరువు ఆయకట్టు సర్వే పనులను ఆదివారం వరకు పూర్తి చేయాలని ఆదేశించారు.
బీర సాగర్ పంపు హౌస్ లో పంపుల మరమ్మత్తులకు కావలసిన పరికరాలను తెప్పించి పనులు పూర్తి చేసి జూలై మాసం చివరి కల్ల నీటిని ఎత్తి పోయు విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంప్ హౌస్ ముంపునకు గురికాకుండా చేపట్టిన రక్షణ చర్యల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. గోదావరి నుండి అప్రోచ్ కెనాల్ ద్వారా నీరు రావడానికి ఇసుక తొలగింపునకు
మైనింగ్ అధికారులను ఆదేశించడం జరిగిందని, బీర సాగర్ పంప్ హౌస్ వద్ద విద్యుత్ సబ్ స్టేషన్ పనులు పూర్తి అయ్యాయని , గారేపల్లి పంప్ హౌస్ వద్ద నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ కు కావలసిన ట్రాన్స్ఫార్మర్స్, మెటీరియల్ తెప్పించి సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు.రెండు పంప్ హౌస్ ల అప్రోచ్ కెనాళ్లు, ప్రధాన కాల్వలు పూర్తిచేయాలని తెలిపారు.
మల్హర్ మండలం రుద్రారం చెరువు కట్ట పనులు,
గారేపల్లి పంప్ హౌస్ నుంచి ఆదివారం పేటచెరువు వరకు పైపులైను నిర్మాణం పనులు పూర్తి చేయాలని ఈ సీజన్ లో మొదటి విడత పనులు పూర్తి చేసి పంటలకు నీరందించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఎస్.ఈ మల్చూర్,
ఆర్డీవో మంగిలాల్, ఇరిగేషన్ ఈ ఈ యాదగిరి, మహ దేవపూర్, కాటారం తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.