Sunday, September 8, 2024

మైనర్ బాలుడుతో గంజాయి స్మగ్లింగ్ … అరెస్టు

- Advertisement -

ఒడిషా నుండి హైదరాబాద్ కు గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న దంపతులతో పాటు ఒక మైనర్ బాలుడి అరెస్టు…

ఇంతేజార్ గంజ్ పోలీసుల చాక చక్యంతో అరెస్టు చేసారు…

వీరి నుండి 4లక్షల 70వేల రూపాయల విలువగల సూమారు 24కిలోల గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వరంగల్ క్రైం బ్యూరో (వాయిస్ టుడే ప్రతినిధి):  ఒడిషా నుండి హైదరాబాద్కు గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న దంపతులతో పాటు ఒక మైనర్ బాలుడిను  ఇంతేజార్ గంజ్ పోలీసులు చాక చక్యంతో అరెస్టు చేసి  వీరి నుండి 4లక్షల 70వేల రూపాయల విలువగల సూమారు 24కిలోల గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Smuggling of ganja with minor boy...arrested
Smuggling of ganja with minor boy…arrested

ఈ అరెస్టు సంబంధించి సెంట్రల్ జోన్ డిసిపి అబ్దుల్ బారి వివరాలను వెల్లడిస్తూ, బీహర్ రాష్ట్రం, సరస్చప్రా జిల్లా చెందిన యోగేంద్ర రామ్ (30), వేదవతి దేవి (40) కొద్ది కాలంగా సహజీవనం చేస్తూ స్వగ్రామంలో రోజువారి కూలీ పనులు చేసేవారు. కూలీ పనుల ద్వారా వచ్చే డబ్బులు వీరి అవసరాలకు సరిపోకపోవడంతో సులువుగా డబ్బు సంపాదించాలనుకున్నారు. ఇదే సమయంలో బీహర్ రాష్ట్రం ఖట్సే ప్రాంతానికి గంజాయి అక్రమ రావాణా వ్యాపారి అయిన అఖిలేష్తో పరిచయం అయింది. ఈ పరిచయంతో నిందితులు మరో మైనర్ బాలుడితో కల్పి ఒడిషా రాష్ట్రంలోని బరంపుర గ్రామ పరిసరాల్లో తక్కువ ధరకు గంజాయిని కోనుగోలు చేసి అఖిలేష్ సూచనల మేరకు నిందితులు ముగ్గురు రైలులో ప్రయాణికులు వేషంలో ప్రయాణిస్తూ హైదరాబాద్ కు చెందిన అరవింద్ గంజాయి విక్రయదారుడికి గంజాయిని గత కొద్ది కాలంగా అందజేసేవారు. ఇందుకోసం పోలీసులు అరెస్టు చేసిన నిందితులు గంజాయి విక్రయదారులు ఐదువేల రూపాయలను అందజేసేవారు. ఇదే రీతిలో నిన్నటి రోజున ఈ స్మగ్లర్ల ముఠా 24 కేజీల గంజాయి పదకొండు చిన్న చిన్న ప్యాకేట్లగా తయారు చేసి బ్యాగుల్లో రహస్యంగా భద్రపర్చుకోని ఒడిషా నుండి హైదరాబాద్ వెళ్ళే రైలులో ప్రయాణించే క్రమంలో పోలీసులకు అనుమానం రాకుండా వుండేందుకుగాను నిందితులు వరంగల్ రైల్వే స్టేషన్ దిగి హైదరాబాద్కు మరో రైలులో వెళ్ళేందుకు, రైల్వే స్టేషన్ ముందుగా అనుమానస్పదంగా తిరుగుతున్నట్లుగా ఇంతేజార్ గంజ్ పోలీసులకు సమాచారంతో స్థానిక రైల్వే ప్రోటేక్షన్ పోలీసుల సహకారంతో గంజాయి స్మగ్లర్ల ముఠా పోలీసులు అదుపులోకి తీసుకోని వారి బ్యాగులను తనీఖీ చేయగా బ్యాగుల్లో గంజాయిని గుర్తించి పోలీసులు నిందితులను అరెస్టు విచారణ నిమిత్తం ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్కు తరలించారు.  ఈ గంజాయి స్మగర్ల పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఇంతేజార్ గంజ్ ఇన్స్స్సెక్టర్ శ్రీనివాస్, ఎస్.ఐ. కొమురెల్లితో పాటు ఇతర పోలీస్ సిబ్బందిని సెంట్రల్ జోన్ డిసిపి అభినందించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్