కాకాణిపై సోమిరెడ్డి ఫైర్

- Advertisement -

కాకాణిపై సోమిరెడ్డి ఫైర్

Somireddy fire on Kakani

నెల్లూరు
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూరాయపాళెంలోని ఇసుక రీచ్ విషయంలో కాకాణి చేసిన ఆరోపణల నేపథ్యంలో,  రీచ్ ని టీడీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా బయటకు వెళ్లకుండానే, 100 కోట్ల ఆరోపణలు తనపై చేయటానికి కాకాణికి సిగ్గుండాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కాకాణి అధికారాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలు సంపాదించారని చెప్పారు. తనకు 1000 కోట్ల ఆస్తులున్నాయని విమర్శలు చేశారని.. ఇప్పటికీ నిరూపించలేకపోయారని తెలిపారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడాలని.. నోరు అదుపులో పెట్టుకోవాలని కాకాణిని హెచ్చరించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular