- Advertisement -
త్వరలో కాంగ్రెస్ పార్టీ లోకి తాజ్మోహన్ రెడ్డి
Soon Tajmohan Reddy will join the Congress party పిసిసి అద్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గౌడ్ ను కలిసి అభినందనలు
హైదరాబాద్ సెప్టెంబర్ 11
ఇటీవల జవహర్‌నగర్ మునిసిపాలిటి కమీషనర్‌గా రిటైర్మెంట్ ఐన తెలంగాణా మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అద్యక్షులు ఎల్.తాజ్మోహన్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నట్లు ప్రకటించారు.బుదవారం ఓల్డ్ ఎంఎల్ఏ క్వాటర్స్ లో తెలంగాణా పిసిసి అద్యక్షుల నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ ను కలిసి అభినందనలు తెలిపారు.రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం లో అనేక కొత్త మార్పులు వస్తున్నయని వాటిని ప్రజలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పిసిసి అద్యక్షుల నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వం లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమై ముందుకు వేల్లగాలదన్న ఆశాబావాన్ని వ్యక్తం చేసారు.
- Advertisement -




