0.1 C
New York
Wednesday, February 21, 2024

‘విశ్వంభర’ షూటింగ్ లో జాయిన్ అయిన సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్

- Advertisement -

 మెగాస్టార్ చిరంజీవి, వశిష్ట, యువి క్రియేషన్స్ మెజెస్టిక్ ‘విశ్వంభర’ షూటింగ్ లో జాయిన్ అయిన సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్

మెగాస్టార్ చిరంజీవి కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో వేసిన మ్యాసివ్ సెట్‌లో తన మాగ్నమ్ ఓపస్ మూవీ ‘విశ్వంభర’ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో మొత్తం 13 మ్యాసీవ్ సెట్‌లను నిర్మించింది చిత్ర బృందం. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన కథానాయికగా నటించడానికి సౌత్ క్వీన్ త్రిష కృష్ణన్‌ను మేకర్స్ ఎంపిక చేశారు.
త్రిష కృష్ణన్ ఈ రోజు షూట్‌లో జాయిన్ అయ్యారు. ఆమెకు చిరంజీవి, దర్శకుడు వశిష్ట, నిర్మాతల నుంచి ఘన స్వాగతం లభించింది. మెగా మాస్ బియాండ్ యూనివర్స్‌కి ఆమె తన చార్మ్, గ్రేస్ ను జోడించడానికి సిద్ధంగా వున్నారు. త్రిష గతంలో చిరంజీవి కల్సి ‘స్టాలిన్‌’లో పనిచేశారు, ఈ కాంబినేషన్‌లో మ్యాజికల్ కెమిస్ట్రీని మనం ఆశించవచ్చు.మెగా ఫాంటసీ అడ్వెంచర్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విక్రమ్, వంశీ, ప్రమోద్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవికి కాస్ట్లీయస్ట్  చిత్రంగా నిలుస్తోంది.ఈ సినిమా సాంకేతికంగా చాలా గ్రాండీయర్, విజువల్ వండర్ గా ఉండబోతుంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్.
కోటగిరి వెంకటేశ్వరరావు, సంతోష్‌ కామిరెడ్డి ఈ చిత్రానికి ఎడిటర్‌లుగా వ్యవహరిస్తున్నారు. శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ లిరిక్ రైటర్స్.  శ్రీనివాస్ గవిరెడ్డి, గంటా శ్రీధర్, నిమ్మగడ్డ శ్రీకాంత్, మయూఖ్ ఆదిత్య స్క్రిప్ట్ అసోసియేట్‌లుగా ఉన్నారు.సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.
తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, త్రిష కృష్ణన్

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!