( ఆంధ్ర – తెలంగాణ బార్డర్ ) జిల్లా సరిహద్దు సుంకేశుల బార్డర్ చెక్ పోస్టును ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ జి. కృష్ణకాంత్ .
కర్నూలు, ఏప్రిల్ 26,
ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్ర సరిహద్దు కర్నూలు జిల్లా, గూడురు పోలీసుస్టేషన్ పరిధిలో ఉన్న సుంకేశుల డ్యామ్ చెక్ పోస్టును జిల్లా ఎస్పీ
జి. కృష్ణకాంత్ శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా
కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు, సెబ్ పోలీసులు, లోకల్ పోలీసులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మాట్లాడుతూ
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆంధ్ర – తెలంగాణ బార్డర్ చెక్ పోస్టులలో ఓటర్ల ను ప్రభావితం చేసే నగదు , మద్యం అక్రమ రవాణా జరగకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు.
ప్రతి వాహనాన్ని తప్పనిసరిగా తనిఖీ చేయాలి. ఎన్నికల నియమావళికి విరుధ్దంగా అక్రమంగా తరలించే నగదు , మద్యం, ఇతర కానుకల రవాణలను అరికట్టాలన్నారు.
సరైన ఆధారాలు లేకుండా రూ. 50 వేలకు మించి నగదు లభ్యమైతే సీజ్ చేసి సంబంధిత అధికారులకు అప్పగించాలని సూచించారు.
చెక్ పోస్టులలో పకడ్బందీగా విధులు నిర్వహించాలి. ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలి.
పోలీసు అధికారులు , సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున విధులు నిర్వహించే సిబ్బంది సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ తెలిపారు.
జిల్లా ఎస్పీ తో స్పెషల్ బ్రాంచ్ సిఐ శ్రీనివాస రెడ్డి, సెబ్ సిఐ మల్లిక, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ శ్యామల, గూడూరు ఎస్సై హనుమంతయ్య ఉన్నారు.