డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా  జనసైనికుల ప్రత్యేక పూజలు

- Advertisement -

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా  జనసైనికుల ప్రత్యేక పూజలు

Special pooja by Jana Sainiks Prayaschitta Diksha taken by Deputy CM Pawan Kalyan 

బద్వేలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా శుక్రవారం పోరుమామిళ్లలో జనసేన పార్టీ నాయకులు శీలంశెట్టి లక్ష్మయ్య, జనసేన వీర మహిళ శీలంశెట్టి విజయలక్ష్మి, నగిరి రమణయ్య, రామాయణపు రామ్మోహన్, తమ్మిశెట్టి రమణయ్య, ఎక్కలూరి సిద్దు, పాత కడప సిద్దయ్య, బైరిశెట్టి అశోక్, గాలి రామకృష్ణ, గండికోట శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించిపవన్ కళ్యాణ్ దీక్షకు సంఘీభావం తెలియజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత వైసిపి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంతో పవిత్రంగా భావించే తిరుమల స్వామి వారి లడ్డు ప్రసాదం కల్తీ పై మండిపడ్డారు. కోట్లాదిమంది భారతీయుల మనోభావాలను దెబ్బతీసే విధంగా లడ్డు ప్రసాదం జంతువుల కొవ్వులతో తయారీ దారుణం అన్నారు. ఆ తప్పును కప్పిపుచ్చేందుకు వైసిపి నాయకుడు నాని వ్యాఖ్యలు సరికావని ఇటువంటి లీడర్లను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కనపడిన తరిమి తరిమి కొడతామని హెచ్చరించారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే తక్షణమే విచారణ చేపట్టి వారికి కఠినంగా శిక్ష పడాలని కోరారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular