సాక్షిగణపతిస్వామికి విశేష పూజలు

- Advertisement -

శ్రీశైలం:  లోక కల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం బుధవారం రోజు  ఉదయం సాక్షిగణపతి  స్వామి వారికి విశేష అభిషేకాన్ని నిర్వహించింది. కాగా ప్రతి బుధవారం, సంకటహర చవితిరోజులు మరియు పౌర్ణమిరోజులలో శ్రీసాక్షిగణపతి వారికి ఈ విశేష అభిషేకం మరియు పూజాధికాలు దేవస్థానం సేవగా  నిర్వహించబడుతున్నాయి.బుధవారం ఉదయం సాక్షిగణపతిస్వామివారికి పంచామృ తాలతోనూ, పలుపలోదకాలతోనూ, హరిద్రోదకం,గంధోదకం, పుష్పోదకం,కలశోదకం, శుద్ధజ లంతో అభిషేకం నిర్వహించబడింది. తరువాత స్వామివారికి విశేషపుష్పార్చన, నివేదన కార్య క్రమాలు జరిపించబడ్డాయి. వైదిక సంప్రదాయాలలో గణపతి అభిషేకానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఈ గణపతి అభిషేకం  వలన  అనుకున్న   పనులలో ఆటంకాలు  తొలగి విజయం లభి స్తుందని చెప్పబడుతోంది. అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయుధారోగ్యాలు, సిరిసం పదలు కలుగుతాయని ముఖ్యంగా విద్యార్థులలో ఆలోచనా శక్తి పెరిగి విద్య బాగా వస్తుందని చెప్పబడుతోంది. కాగా   శ్రీశైలక్షేత్ర  పరివార   ఆలయాలలో  సాక్షిగణపతి  ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. భక్తులు శ్రీశైల మహా క్షేత్రాన్ని సందర్శించినట్లుగా కైలాసంలో పరమేశ్వరుని వద్ద ఈ స్వామి సాక్ష్యం చెబుతాడని ప్రసిద్ధి. అందుకే ఈ స్వామి సాక్షిగణపతిగా పేరొందాడు. చక్కని నల్లరాతితో మలచబడిన ఈ స్వామి ఒకచేతిలో కలం, మరోచేతిలో పుస్తకాన్ని ధరించి భక్తుల పేర్లను నమోదు చేస్తున్నట్లుగా దర్శనం ఇస్తాడు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular