విద్యార్థులకు ఛావా సినిమా ప్రత్యేక ప్రదర్శన
Special screening of the movie Chava for students
కోరుట్ల,
:చత్రపతి శంభాజీ మహారాజ్ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక సరస్వతీ శిశు మందిర్ విద్యార్థులు శంభాజీ మహారాజు చిత్రపటానికి పూలమాలలు వేసి
కి నివాళులు అర్పించారు.ఈ సంధర్భంగా లక్ష్మీ థియేటర్లో ఛావా సినిమాను విద్యార్థులు వీక్షించారు. ఈ అవకాశం కల్పించిన సనాతన ధర్మ పరిషత్, జనసేన నాయకులకు విద్యార్థులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.అలాగే సరస్వతి శిశు మందిర్ స్కూలుకు పూర్వ వైభవం తీసుకొచ్చి విద్యార్థినీ, విద్యార్థులకు దేశభక్తిని సనాతన ధర్మాన్ని ప్రతిరోజు వారికి అర్థమయ్యేలా చెబుతూ కార్పోరేట్ స్కూల్లకు దీటుగా సరస్వతీ శిశు మందిరాన్ని నడిపిస్తూ విద్యార్థినీ, విద్యార్థులను దేశభక్తులుగా ధర్మ భక్తులుగా తీర్చిదిద్దుతున్న సరస్వతీ శిశు మందిర్ స్కూల్ యాజమాన్యానికి సనాతన ధర్మ పరిషత్, జనసేన నాయకులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సమితి సభ్యులు వడ్లకొండ రాజ గంగారం, చెట్పల్లి శంకర్,ముదిగొండ రాజేశం, సభ్యులు వనపర్తి చంద్రమోహన్ కొండ బత్తిని అమర్నాథ్, పాఠశాల ప్రధానాచార్యులు గోపు వెంకటేష్, కరస్పాండెంట్ నీలి శ్రీనివాస్ పూర్వ విద్యార్థులు యెన్నం కిషోర్,విద్యార్థులు పాల్గొన్నారు.