Wednesday, May 6, 2026

మార్చి 27న ….తెలుగు రాష్ట్రాల్లో ‘L2E ఎంపురాన్’ను విడుద‌ల చేస్తోన్న శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌..

- Advertisement -

తెలుగు రాష్ట్రాల్లో ‘L2E ఎంపురాన్’ను విడుద‌ల చేస్తోన్న శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌.. మార్చి 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌

Sri Venkateswara Creations is releasing 'L2E Empuraan' in Telugu states on March 27th.

ఎన్నో సూప‌ర్ డూప‌ర్ చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్ర‌ముఖు నిర్మాణ సంస్థ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నుంది. ఆ చిత్ర‌మే ‘L2E ఎంపురాన్’. మల‌యాళ సూప‌ర్‌స్టార్, కంప్లీట్ యాక్టర్ మోహన్‌ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమార్ తెరకెక్కించిన లూసిఫర్‌కు సీక్వెల్‌గా ‘L2E ఎంపురాన్’ను రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మార్చి 27న రిలీజ్ చేయబోతోన్నారు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని మార్చి 27న గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ హై ఆక్టేన్, స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ విడుద‌ల చేస్తుండ‌టం విశేషం.
మోహన్ లాల్ ఖురేషి-అబ్రామ్ అలియా స్టీఫెన్ నెడుంపల్లిగా మ‌రోసారి మాస్ అవ‌తార్‌లో మెప్పించ‌బోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, టోవినో థామస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫేమ్ జెరోమ్ ఫ్లిన్, అభిమన్యు సింగ్, ఆండ్రియా తివాదర్, సూరజ్ వెంజరమూడు, ఇంద్రజిత్ సుకుమారన్, మంజు వారియర్, సానియా అయ్యప్పన్, సాయికుమార్, బైజు సంతోష్, ఫాజిల్, సచిన్ ఖేదేకర్, నైలా ఉష, గిజు జాన్, నందు, శివాజీ గురువాయూర్, ఎస్ మణికుట్టన్, మణికుట్టన్, మణికుట్టన్ ఉన్నారు. ఓ’నెల్, ఎరిక్ ఎబౌనీ, మిఖాయిల్ నోవికోవ్, కార్తికేయ దేవ్ త‌దిత‌రులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలను పోషించారు.
ఫ‌రీదాబాద్‌, సిమ్లా, లేహ్, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్, చెన్నై, గుజరాత్, హైదరాబాద్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ముంబై, కేరళతో సహా పలు ప్రదేశాలలో షూటింగ్ జరిగింది. 1:2.8 రేషియోతో అనమోర్ఫిక్ ఫార్మాట్‌లో ఈ చిత్రాన్ని రూపొందించారు.  సినిమాటోగ్రాఫర్ సుజిత్ వాసుదేవ్, ఎడిటర్ అఖిలేష్ మోహన్, ఆర్ట్ డైరెక్టర్ మోహన్‌దాస్, స్టంట్ డైరెక్టర్ స్టంట్ సిల్వా, క్రియేటివ్ డైరెక్టర్ నిర్మల్ సహదేవ్, మ్యూజిక్ డైరెక్టర్ దీపక్ దేవ్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానున్నారు.
జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఫిబ్రవరి 9న సినిమాలోని పాత్రను పరిచయం చేస్తూ వదిలిన గ్లింప్స్ అందరినీ మెప్పించింది. ఆశీర్వాద్ సినిమాస్, లైకా ప్రొడక్షన్స్ యూట్యూబ్ ఛానెల్‌లలో గత కొన్ని రోజులుగా సినిమాలోని అన్ని పాత్రలను రివీల్ చేస్తూ వదిలిన గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫిబ్రవరి 26న ఖురేషి-అబ్రహం అలియాస్ స్టీఫెన్ నేడుంపల్లిగా మోహన్‌లాల్ పాత్రను గ్రాండ్‌గా రివీల్ చేయడంతో అభిమానులలో అంచనాలను మరింత పెంచింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్