కాంగ్రెస్ లోకి శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ
హైదరాబాద్
Srilingampally BRS MLA Arikapudi Gandhi joined the Congress
శేరిలింగంపల్లి బీఆరెస్ ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేతో పాటు సీఎం సమక్షంలో పలువురు కార్పొరేటర్లు, అనుచరులు కాంగ్రెస్ లో చేరారు. శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్,తదితరులు కాంగ్రెస్ లో చేరారు.
అంతకుముందు ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ పదేళ్ళు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా పని చేసి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేసాను. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గంలో అభివృద్ధి అనేది సరిగ్గా జరగటం లేదు. నియోజకవర్గం అభివృద్ది కొరకు కార్యకర్తలు, శ్రేయోభిలాషుల సూచనలతో పార్టీ మారుతున్నానని అన్నారు.



