శ్రీనిధి కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు కుచ్చుటోపి
మేడ్చల్ జిల్లా:ఆగస్టు 23 : ఘట్కేసర్ శ్రీనిధి కాలేజ్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.
యూనిర్సిటీకి గుర్తింపు లేకపోయినా తమ వద్ద కోట్లాది రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తూ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు 15లోపు విద్యార్థులను వేరే కాలేజీలకు బదిలీ చేస్తామని చెప్పి యాజమాన్యం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు.
తమ పిల్లల భవిష్యత్తును అంధకారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే కాలేజీ యాజమన్యం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తమ పిల్లలకు న్యాయం చేసే వరకూ ఆందోళన చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు కాలేజీలోకి వెళ్లేందుకు యత్నించారు.
దీంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు, విద్యార్థులకు వాగ్వాదం జరిగింది. పోలీసులు విద్యార్థులను వారి తల్లిదండ్రులను శాంతింప చేశారు…