తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డిని నియమించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు :
టీయూడబ్ల్యూజే (ఐజేయూ) కూకట్ పల్లి జాయింట్ సెక్రెటరీ జయ కుమార్ గుప్తా
కూకట్ పల్లి : ఫిబ్రవరి 26(వాయిస్ టుడే)
ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డిని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ఐజేయూ అనుబంధ సంస్థ అయిన టీయూడబ్ల్యూజే కూకట్ పల్లి జాయింట్ సెక్రటరీ ఎల్లకొండ జై కుమార్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రతిక్షణం పాటుపడే శ్రీనివాస్ రెడ్డి మీడియా అకాడమీ ఛైర్మన్ గా నియమితులైన సందర్భంగా కూకట్ పల్లి జర్నలిస్టుల తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. గత 10 సంవత్సరాలుగా ఎదురుకొంటున్న జర్నలిస్ట్ ల సమస్యలు తెలిసిన శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరింపజేస్తారని ఆకాంశిస్తూ మరోమారు శుభాకాంక్షలు తెలియజేశారు.