- Advertisement -
తెలంగాణకు మొండిచెయ్యి–హరీష్ రావు
Stand up for Telangana--Harish Rao
సిద్దిపేట
కేంద్ర బడ్జెట్ పై మాజీ ఆర్థికమంత్రి హరీష్ రావు స్పందించారు.దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. కానీ దేశమంటే కొన్ని రాష్ట్రాలు కాదోయ్ దేశమంటే 28 రాష్ట్రాలోయ్ అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. కేంద్ర బడ్జెట్ తుంగలో తొక్కేలా ఉంది. దేశానికి 5.1 జీడీపీ ఇచ్చి దేశాన్ని తెలంగాణ పోషిస్తుంది. కానీ పోయినసారి ఆంధ్రకు, ఈసారి బీహార్ కి బడ్జెట్ లో పెద్దపీట వేసి తెలంగాణకి మొండిచేయి చూపారు. బడేభాయ్ అని ప్రధాని మోడీని సీఎం రేవంత్ మెచ్చుకుంటున్నారు. కానీ బడేభాయ్ ఈ చోటే భాయ్ ని పట్టించుకోవడం లేదు. ముప్పై సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ 30 రూపాయలు కూడా రాష్ట్రానికి తేలేదు. కాంగ్రెస్ ఎంపీలు 8 మంది, బీజేపీ ఎంపీలు 8 మంది కలిసి రాష్ట్రానికి గుండు సున్నా తెచ్చారు.
- Advertisement -