Wednesday, June 18, 2025

 బ్రోకోడ్’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ హీరో రవి మోహన్

- Advertisement -

 బ్రోకోడ్’ చిత్రంతో హీరోగా, నిర్మాతగా ప్రేక్షకుల ముందుకు రానున్న స్టార్ హీరో రవి మోహన్

Star hero Ravi Mohan to make his debut as a hero and producer with the film 'Brocode'

కోలీవుడ్‌లో రవి మోహన్‌కు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. ఇన్నేళ్లు హీరోగా అందరినీ మెప్పించిన రవి మోహన్ ఇకపై నిర్మాతగానూ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తాజాగా ఆయన హీరోగా, నిర్మాతగా రానున్న ‘బ్రోకోడ్’ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ప్రకటించారు. ‘డిక్కిలూనా’, ‘వడక్కుపట్టి రామసామి’ వంటి చిత్రాలతో ప్రసిద్ధి చెందిన కార్తీక్ యోగి దర్శకత్వంలో ఈ ‘బ్రోకోడ్’ రానుంది. నలుగురు ప్రముఖ మహిళా నటులతో పాటు ప్రముఖ నటుడు ఎస్.జె. సూర్య కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నారు.
పోర్ తోజిల్ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కలైసెల్వన్ శివాజీ, యానిమల్, అర్జున్ రెడ్డి వంటి విజయాలను అందించిన హర్షవర్ధన్ ఈ ప్రాజెక్ట్ కోసం పని చేయనున్నారు. ఎడిటర్‌గా ప్రదీప్ ఇ. రాఘవ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎ. రాజేష్ వ్యవహరించనున్నారు. స్లాప్ స్టిక్ కామెడీ అంశాలతో కూడిన వినోదాత్మక ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నటుడు రవి మోహన్ స్వయంగా రవి మోహన్ స్టూడియోస్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.
ఈ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు కార్తీక్ యోగి మాట్లాడుతూ.. ‘నేను రవి మోహన్‌కి కథ చెప్పినప్పుడు ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆయన ఈ కథను పూర్తిగా ఆస్వాదించారు. కథ విన్న వెంటనే దానిని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో స్లాప్ స్టిక్ హాస్యం అధికంగా ఉంటుంది. ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా రూపొందిస్తున్నామ’ని అన్నారు.
నలుగురు ప్రముఖ మహిళా నటీనటుల గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో ప్రారంభం కానుంది. రవి మోహన్ ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ‘పరాశక్తి’, గణేష్ కె. బాబు డైరెక్ట్ చేస్తున్న ‘కరాటే బాబు’ చిత్రాలలో కూడా నటిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్