పాన్ వరల్డ్ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ ‘కంగువ’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన స్టార్ హీరో సూర్య
నేషనల్ అవార్డ్ విన్నర్, స్టార్ హీరో సూర్య నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కంగువ’. ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి. పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ రూపొందిస్తున్నారు. దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తోన్న ‘కంగువ’లో బాబీ డియోల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. తాజాగా ‘కంగువ’ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ వర్క్స్ స్టార్ట్ చేశారు హీరో సూర్య. డబ్బింగ్ వర్క్స్ జరుగుతున్న అద్నాన్ ఆర్ట్స్ స్టూడియోస్ లో హీరో సూర్యతో డైరెక్టర్ శివ, ఇతర టెక్నీషియన్స్ ఫొటో తీసుకున్నారు.
పాన్ వరల్డ్ మూవీగా మొత్తం పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’లో వరల్డ్ క్లాస్ మేకింగ్, సూర్య పర్ ఫార్మెన్స్ హైలైట్ కానుంది. హీరో సూర్య కెరీర్ లో హై బడ్జెట్ మూవీగా రూపొందుతున్న ‘కంగువ’ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్పెషల్ ఫిల్మ్ కాబోతోంది. త్వరలోనే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. త్రీడీలోనూ ‘కంగువ’ ప్రేక్షకుల ముందుకు రానుంది.
నటీనటులు – సూర్య, దిశా పటాని, యోగి బాబు, బాబీ డియోల్ తదితరులు