అక్టోబర్ 4,5,6న  రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ క్రీడలు….

- Advertisement -

అక్టోబర్ 4,5,6న  రాష్ట్రస్థాయి ఉపాధ్యాయ క్రీడలు….

State Level Teachers Games on October 4, 5, 6...

హాజరుకానున్న మంత్రి

బద్వేలు
యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో అక్టోబర్ 4,5,మరియు 6న జరగబోవు ఉపాధ్యాయ క్రీడల ప్రారంభానికి రవాణా,క్రీడలు మరియు యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని  ఆహ్వానించామని  యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి రాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు  తెలిపారు.
ప్రొద్దుటూరులో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని యుటిఎఫ్ నాయకులు లక్ష్మీరాజా,పాలెం మహేష్ బాబు,నరసింహారావు, చంద్ర ఓబుల్ రెడ్డి తదితరులు కలిసి రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానించడం జరిగింది.

గుంటూరు లో జరిగే రాష్ట్ర స్థాయి ఆటల పోటీల ప్రారంభింటానికి సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయులు బోధనతోపాటు క్రీడల్లో భాగస్వాములు కావడం ఎంతో శుభదాయకమని, యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు నిర్వహించడం చాలా సంతోషించదగ్గ విషయమని తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే క్రీడా పోటీల్లో పాల్గొని ఉపాధ్యాయులను ఉత్సాహపరచడానికి తాను ముందు ఉంటానని తెలిపారు. ఉపాధ్యాయులే దేశ భవిష్యత్తుకు మూల స్తంభాలని, ఉపాధ్యాయులు శారీరకంగా మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నప్పుడే భావి భారత పౌరులను నిర్మించగలుగుతారని తెలిపారు.

యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాలలో జిల్లా స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులందరూ అక్టోబర్ 4,5,6 తేదీలలో గుంటూరులో జరుగనున్న రాష్ట్రస్థాయి  పోటీలలో పాల్గొనవలసి ఉంటుందని తెలిపారు. రాష్ట్రస్థాయిలో విజేతలైన వారికి డిసెంబర్ 14 నుండి 17 వరకు కాకినాడలో జరగబోవు రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని బహుమతి ప్రధానం చేయడం జరుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయులకు జరిగే రాష్ట్రస్థాయి ఆటల పోటీల కు ముఖ్యఅతిథిగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయితే ఉపాధ్యాయుల్లో మరింత రెట్టింపు ఉత్సాహం కలుగుతుందని తెలిపారు. ఉపాధ్యాయుల పట్ల రాంప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక అభిమానం ఉందని, రాష్ట్రస్థాయిలో జరిగే క్రీడల్లో ఉపాధ్యాయులను ఉత్సాహపరిచి క్రీడల్లో భాగస్వాములు అవుతానని తెలుపడం ఆనందదాయకమని తెలిపారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular