Friday, April 4, 2025

పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర

- Advertisement -

పార్టీ కార్యకర్తల ఆకాంక్షల మేరకు భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర

State-wide padayatra in future as per the wishes of the party workers

 పార్టీ నేతలపై వేధింపులు, అక్రమ కేసులు పెడుతున్న పోలీసులపై కఠిన చర్యలు
కేటీఆర్
హైదరాబాద్
పార్టీ కార్యకర్తలు అంతా కోరుతున్నందున భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను నిర్వహిస్తానని భాతర రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఅర్ తెలిపారు. దీపావళిరోజు నెటిజన్లతో జరిగిన సామాజిక మాద్యమం ఎక్స్ సంభాషణ అక్స్ కెటిఅర్ లో ఈ మేరకు కెటిఅర్ తెలిపారు. పలువరు ప్రత్యేకంగా ఈ అంశంలో కెటిఅర్ అభిప్రాయాన్ని కోరారు. దేశంలోని అనేక పార్టీల నేతలు, ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టడంతోపాటు, పార్టీలను బలోపేతం చేసేందుకు పార్టీ అద్యక్షులు పాదయాత్రలు చేస్తున్నారు, మీరేప్పుడు చేస్తారని అడిగారు. దీనికి స్పందించిన కెటిఅర్ ఖచ్చితంగా తన పాదయాత్ర ఉంటుందని వెల్లడించారు.
దాదాపు గంటన్నపాటు సాగిన ఈ సంభాషణలో కెటిఅర్ అనేక అంశాలపై తన అభిప్రాయాలను ప్రజలతో పంచుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు శాపం
తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పాలన ఒక శాపంగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశాలు ఏమాత్రం లేవు… అందుకే అబద్ధాల మీద, అసత్యాల మీద సమయం గడుపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. గత పది నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక్క మంచి కూడా గుర్తుకు రావడం లేదన్నారు. అబద్ధపు హామీల మీద ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంతకంటే గొప్ప పరిపాలన ఆశించలేమన్నారు, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రాజకీయ వేధింపులను ప్రారంభించింది అన్నారు. అయితే వీటికి భయపడేది లేదని కేటీఆర్ అన్నారు. సన్నవడ్లకు కూడా బోనస్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ హామీ బోగస్ గా మారిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లు వేసి మద్దతు ధర లేక రైతుబంధు లేక నష్టపోతున్న రైతన్నల తరఫున పోరాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలన ప్రమ్ ఢిల్లీ, టూ ఢిల్లీ, ఫర్ డీల్లీ అన్నట్లుగా తయారైందని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ పాలనలో జరిగుతున్న  పతనం నుంచి తెలంగాన కోలుకోవడం అసాద్యం
నాలుగు సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారం పోవడం ఖాయమని అయితే కొత్త ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చేసిన నష్టం నుంచి తెరుకొని ముందుకు తీసుకుపోవడం అతిపెద్ద సవాలుగా మారుతుందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక ప్రగతి పూర్తిగా పతనం అయిందన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆదాయ వనరులు నుంచి మొదలుకొని వ్యవసాయ రంగం, అన్ని రంగాలు  తిరోగమనంలో ఉన్నాయన్నారు. నిరుద్యోగితక పెరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అనేక కంపెనీలు వదిలి వెళ్ళిపోతున్నాయన్నారు. ఈ అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయో ఎవరికీ తెలియడం లేదన్నారు. కాంగ్రెస్ పాలన వలన జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవడం అప్పుడప్పుడే సాధ్యం కాదు అన్నారు
ప్రజల పక్షాన కోట్లాడడమే ప్రస్తుత భాధ్యత
ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష బాధ్యతలు నిర్వహించడం పైన ప్రధానంగా దృష్టి సారించామని తెలిపిన కేటీఆర్, ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుతో పాటు తీసుకున్న నిర్ణయాలలో పారదర్శకత పైన ప్రజల తరఫున కొట్లాడుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అప్పుడే బలమైన ప్రజా వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని రాజ్యాంగబద్ధంగా మార్చే అవకాశం ఉన్నదా అని ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మరో నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిందే అన్నారు. అయితే ప్రజలు ఐదు సంవత్సరాల కోసం కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్