Sunday, September 8, 2024

స్టీల్ బ్రిడ్జి రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మూసివేత

- Advertisement -

Steel Bridge will be closed from 10 pm to 6 am
Steel Bridge will be closed from 10 pm to 6 am

హైదరాబాద్, ఆగస్టు26:  ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని ఇటీవల ప్రారంభించిన సంగతి తెలిసిందే. 2.25 కి.మీ నాలుగు లైన్ల స్టీల్ బ్రిడ్జిని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనికి మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి పేరు పెట్టారు. వంతెన నిర్మాణానికి దాదాపు రూ.450 కోట్లు వెచ్చించారు. VST జంక్షన్, RTC క్రాస్ రోడ్స్ మరియు ఇందిరా పార్క్ క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి దీనిని నిర్మించారు. సికింద్రాబాద్‌, తార్నాక, ఓయూ, చర్లపల్లి, అంబర్‌పేట, రామాంతపూర్‌, ఉప్పల్‌ మీదుగా వరంగల్‌ వైపు వెళ్లే వారికి కూడా ఈ వంతెన ఎంతో ఉపయోగపడుతుంది. లోయర్ ట్యాంక్ బండ్ నుంచి వీఎస్టీకి వెళ్లేందుకు గతంలో 35 నిమిషాలకు పైగా సమయం పట్టేది.. స్టీల్ బ్రిడ్జి రావడంతో కేవలం 5 నుంచి 10 నిమిషాల్లోనే గమ్యం చేరుతుంది. అయితే ఇప్పుడు ఈ స్టీల్ బ్రిడ్జితో కొత్త కష్టాలు తలెత్తాయి. ఈ స్టీల్ బ్రిడ్జి పక్కనే లేడీస్ హాస్టల్ ఉంది.

దీంతో రాత్రి పూట పోకిరీలు రెచ్చిపోతున్నారు. హాస్టల్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ యువతులపై వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.ఇటీవల ఇద్దరు మైనర్ యువకులు బ్రిడ్జిపై ఫుల్ గా మద్యం తాగారు. మద్యం మత్తులో హాస్టల్ మెట్లు దిగి వస్తున్న ఓ యువతిపై బీరు బాటిల్ విసిరారు. బాలిక తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకుంది. హాస్టల్‌ పరిసరాల్లోని సీసీ కెమెరాలో పోకిరీల చేష్టలకు సంబంధించిన దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనతో హాస్టల్‌లో ఉంటున్న బాలికలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలపై స్థానికులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోకిరీలకు చెక్ పెట్టేందుకు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాత్రిపూట వంతెనపై రాకపోకలను నిలిపివేయాలని నిర్ణయించారు. స్టీల్ బ్రిడ్జిపై ప్రతిరోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. నగర ప్రజల ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఫ్లై ఓవర్‌ను నిర్మించింది. వంతెన నిర్మాణానికి దాదాపు 20 మెట్రిక్‌ టన్నుల స్టీల్‌ను వినియోగించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పొడవైన ఉక్కు వంతెన ఇదే. ఎలాంటి నిర్మాణాలు కూల్చివేయకుండా.. భూసేకరణ లేకుండా ఈ వంతెనను నిర్మించారు. మరో విశేషమేమిటంటే మెట్రో రైలు మార్గానికి ఎగువన నిర్మించిన తొలి ఫ్లైఓవర్ ఇదే.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్