అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి
Strict action should be taken against those who engage in unsocial activities
ఎస్పీ అఖిల్ మహాజన్
రాజన్న
సిరిసిల్ల ప్రతినిధి,
గురువారం రోజున జిల్లా పోలీస్ కార్యాలయం నందు గల మినీ కాన్ఫెరెన్స్ హాలులో సిరిసిల్ల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు. కేసుల విచారణలో జాప్యం చేయకుండా పోలీస్ అధికారులంతా బాధ్యతగా వ్యవహరించాలని, పెండింగులో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ బాధితులకు న్యాయం చేకూరేలా పనిచేయాలని తెలిపారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్టు జారిచేసిన నాన్ బెయిలబుల్ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు.
ప్రతి పోలీస్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోవాలని, నిషేధిత గంజాయి, పీడీఏస్ బియ్యం అక్రమరవాణా,జూదం లాంటి కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి రవాణా చేసే వ్యక్తులతో పాటు గంజాయిని సేవించే వారిని గుర్తించి కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి బ్లాక్ స్పాట్స్, వాటి నివారణకై సంబంధిత అధికారులతో సమన్వయం పాటిస్తూ ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించకుండా మద్యం సేవించి వాహనాలను నడుపుతూ, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐ లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, మధుకర్, శ్రీలత, ఎస్ఐ లు ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.