వైద్య ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు……
Strict arrangements for the visit of the Health Minister
జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
డిసెంబర్ 6న వైద్యారోగ్య శాఖ మంత్రి జిల్లా పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై చర్చించిన జిల్లా కలెక్టర్
ఖమ్మం :
డిసెంబర్ 6న జిల్లాకు రానున్న వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పర్యటనకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.
జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో డిసెంబర్ 6న జిల్లాలో జరిగే వైద్యారోగ్య శాఖ మంత్రి పర్యటనకు సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డిసెంబర్ 6న ఉదయం 10-30 గంటల వరకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఖమ్మం జిల్లాకు చేరుకొని జిల్లా ఆసుపత్రి , మాతా శిశు సంరక్షణ కేంద్రం సందర్శిస్తారని అన్నారు. ఆస్పత్రి పరిసరాల్లో పారిశుధ్య పనులు, ఆసుపత్రిలో సైన్ బోర్డుల ఏర్పాటు పూర్తి చేయాలని అన్నారు.
అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్యరోగ్య శాఖ పని తీరుపై సుదీర్ఘ సమీక్ష ఉంటుందని, ఈ సమావేశానికి వైద్యాధికారులు, సిబ్బంది హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. వైద్యశాఖ పరిధిలో జిల్లాకు ఉన్న అవసరాల గురించి ప్రతిపాదనలు రేపటి వరకు సిద్ధం చేసి సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
వైద్య శాఖ పని తీరు, మన దగ్గర ఉన్న వైద్య ఆరోగ్య వ్యవస్థ, రోగులకు అందుతున్న సేవలను వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేయాలని అన్నారు. జిల్లాలో సీనియర్ సిటిజెన్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక సేవలు, అమలు చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల వివరాలను వివరించాలని అన్నారు.
వైద్యాధికారులు, వివిధ విభాగాల సిబ్బందితో మంత్రి ఇంటరాక్ట్ అవుతారని కలెక్టర్ తెలిపారు. సమీక్ష తర్వాత భోజన విరామం అనంతరం మంత్రి వైద్య కళాశాల నిర్మాణ స్థలం వద్దకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. రాజేశ్వర రావు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి డా. కళావతి బాయి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.