- Advertisement -
కమాన్ పూర్: కమాన్ పూర్ మండలం పెంచికల్ పేట్ గ్రామానికి చెందిన ఆకనపల్లి సుధాకర్ గౌడ్ గారిని మండల బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి గా నియమించడం జరిగింది.
మంథని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, పెద్దపల్లి జిల్లా జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ నియామక పత్రాన్ని వారికి అందజేయడం జరిగింది. నియామకం పట్ల ఆకనపల్లి సుధాకర్ గౌడ్ సంతోషం వ్యక్తం చేస్తూ, జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కి, మండల ప్రజాప్రతినిధులకు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంల కమాన్ పూర్ మండల బి ఆర్ ఎస్ అధ్యక్షుడు బిన్ రెడ్డి కిషన్ రెడ్డి ఎంపీపీ రాచకొండ లక్ష్మీ రవి సర్పంచ్ కొండా వెంకటేష్ గుడిసెల సంపత్ మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -