ఈ నెల16న గ్రామీణ భారత్ బంధు కు మద్దత్తు
ఏఐటీయూసి నేతలు
జిల్లా కలెక్టర్ కు
సమ్మె నోటీస్
జగిత్యాల,
ఈ నెల16 న దేశ వ్యాప్తంగా జరిగే కార్మికుల సమ్మె ,గ్రామీణ భారత్ బంధులో మేము సైతం పాల్గొంటామని గిడ్డంగుల హమాలి లేబర్ కాంట్రాక్ట్స్ సహకార సంఘం సభ్యుల పక్షాన ఏఐటీయూసి నాయకులు మంగళవారం కలెక్టరేట్ ఏవో కు సమ్మె నోటీస్ అందజేశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు, ప్రజా, కార్మిక,రైతు కూలీల వ్యతిరేక విధానాలకు నిరసనగా జయింట్ ఫ్లాట్ఫర్మ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్లు ,కార్మిక, వివిధ రకాల ఉద్యోగ సంఘాలు అఖిలభారత స్థాయిలో కార్మికసమ్మెతో పాటు గ్రామీణ భారత్ బంధు పాటించాలని పిలుపునిచ్చాయని ఏ ఏఐటీయూసీ నాయకులు శ్రీగాధ దేవదాసు, వెన్న మహేష్ లు తెలిపారు. అందుకు గిడ్డంగుల సంస్థ కార్మికులం సైతం సమ్మెలో పాల్గొంటున్నామని అధ్యక్షులు జాడి తిరుపతి,దుర్గయ్య, శ్రీనివాస్ లు ఏవో కు ఇచ్చిన సమ్మె నోటీసులో పేర్కొన్నారు.