కంటోన్మెంట్, అక్టోబర్ 27 (వాయిస్ టుడే ప్రతినిధి): కంటోన్మెంట్ నియోజకవర్గం పరిధిలోని వార్డ్ నెంబర్ 7లో చిన్న కమెలా, ఓల్డ్ డైరీ ఫార్మ్ రోడ్ ,లాల్ బజార్, ఎస్పీ కాలనీ, లో బిజెపి పాదయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిజెపి ఆస్పరెంట్ నాయకురాలు డాక్టర్ పి సుస్మిత శంకర్రావు ఇంటింటికి వెళ్లి బస్తీ లో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా సుస్మిత శంకర్రావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సాయన్న ఐదు సార్లు గెలిచి కంటోన్మెంట్ ను ఏ విధమైన అభివృద్ధి చేశారో చూపించాలన్నారు ఎలక్షన్లు రాగానే తిరుగుడు కాదు ఎలక్షన్ల కన్నా ముందు ప్రజల సమస్యలను ఏ విధంగా తీర్చామని నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశామన్నదే ముఖ్యమన్నారు మాయమాటలు చెప్పే ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితులు లేరు ప్రజలు అన్నారు ఎన్నికలు రాగానే ఒక్కసారి రెండుసార్లు తిరిగామన్నది కాదు నియోజకవర్గ ప్రజలకు ఏ విధమైన అభివృద్ధిని అందించామన్నదే ముఖ్యమన్నారు మీ ప్రచారము ఎలక్షన్ జిమ్మిక్కు అని కంటోన్మెంట్ ప్రజలకు తెలుసు అన్నారు మన కంటోన్మెంట్ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించుకొని మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని బస్తీ వాసులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ ప్రశాంత్, ప్రభు, జిఎస్ సుధీర్, వార్డు మహిళా ప్రెసిడెంట్ బూత్ ప్రెసిడెంట్ మంజుల తదితర బిజెపి నాయకులు పాల్గొన్నారు


