Monday, March 24, 2025

సంతాన ప్రాప్తిరస్తు” నుంచి తరుణ్ భాస్కర్ నటించిన ‘జాక్ రెడ్డి’ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

- Advertisement -

2మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “సంతాన ప్రాప్తిరస్తు” నుంచి తరుణ్ భాస్కర్ నటించిన ‘జాక్ రెడ్డి’ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్

Tarun Bhaskar starrer 'Jack Reddy' character poster release from 'Santana Praptirastu'

విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”.  ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. అల్లు శిరీష్ హీరోగా “ఏబీసీడీ” సినిమా, రాజ్ తరుణ్ తో “అహ నా పెళ్లంట” అనే వెబ్ సిరీస్ రూపొందించిన దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా, ఏక్ మినీ కథ లాంటి చిత్రాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా తెరకెక్కుతోంది.
ఈ రోజు “సంతాన ప్రాప్తిరస్తు” సినిమా నుంచి టాలెంటెడ్ డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ నటించిన ‘జాక్ రెడ్డి’ క్యారెక్టర్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. జాక్ రెడ్డి ఫ్యునెరల్ సర్వీసెస్ అందించే జాక్ రెడ్డికి కుల పట్టింపు కాస్త ఎక్కువే. శతకకర్త వేమన (వేమారెడ్డి) కూడా తమ కులం వాడేనని గర్వంగా చెప్పుకుంటాడు జాక్ రెడ్డి. శవాలతో పాటు సమస్యల్ని కూడా పూడ్చిపెట్టే జాక్ రెడ్డి బాడీ లాంగ్వేజ్ సీరియస్ గా కనిపిస్తున్నా ప్రేక్షకులకు హిలేరియస్ గానే ఉండనుంది. ‘జాక్ రెడ్డి’ క్యారెక్టర్ ను తనదైన స్టైల్ లో పర్ ఫార్మ్ చేశారు తరుణ్ భాస్కర్.
ప్రస్తుతం సొసైటీలో యంగ్ కపుల్స్ ఎదుర్కొంటున్న ఓ ప్రధాన సమస్యను కథలో చూపిస్తూ వినోదాత్మకంగా “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు సంజీవ్ రెడ్డి. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – విక్రాంత్, చాందినీ చౌదరి, వెన్నెల కిషోర్,  తరుణ్ భాస్కర్, అభినవ్ గోమటం, మురళీధర్ గౌడ్, శ్రీ లక్ష్మి, హర్షవర్థన్, బిందు చంద్రమౌళి, జీవన్ కుమార్, సత్య కృష్ణ, తాగుబోతు రమేష్, అభయ్ బేతిగంటి, కిరీటి, అనీల్ గీల, సద్దాం తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్