విద్యుత్ ఛార్జిల్ పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసిన టిడిపి ప్రభుత్వం
TDP government cheated people of Andhra Pradesh by increasing electricity charges
వ్యవసాయ పంపు సెట్లకు వెంటనే కనెక్షన్లు మంజూరు చేయాలి..
రైతులను ప్రజలను మోసం చేసిన టిడిపి ప్రభుత్వం
విద్యుత్ చార్జీలపై వైఎస్ఆర్సిపి పోరుబాట
నందికొట్కూరు డిసెంబర్ 27
విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తామని అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నందికొట్కూరు ఇన్చార్జి డాక్టర్ సుధీర్ ధరా నంద్యాల జిల్లా నందికొట్కూర్ లో విద్యుత్ చార్జీల బాదుడుపై వైసిపి పట్టణ అధ్యక్షులు మన్సూర్ భాష బద్దుల శ్రీకాంత్ ఆధ్వర్యంలో పటేల్ సెంటర్ నుండి విద్యుత్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహిచి విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు నాయక్ మరియు డీయి శ్రీనివాసులుకు విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్లతో కూడిన మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు వైఎస్ఆర్ సీపీ కౌన్సిలర్లు సర్పంచులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సుధీర్ ధరా మాట్లాడుతూ.ఐదేళ్లు విద్యుత్ చార్జీలు పెంచమని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యుత్ చార్జీలను పెంచారన్నారు. తక్షణమే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించేంత వరకు ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. సూపర్‌సిక్స్ హామీలతో గత ప్రభుత్వం కన్నా మెరుగైన సంక్షేమ పథకాలు ఇంటింటికీ అందిస్తామని చెప్పి మాట తప్పుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల వ్యవధిలో రెండు సార్లు విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు.సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ఈ ప్రభుత్వం రూ.15,485 కోట్ల పన్ను భారాలు మోపడం తగదన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారుకూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రజల వద్దకు వెళ్లి విద్యుత్ చార్జీలను పెంచమని మోసపు వాగ్దానాలను గుప్పించారని విమర్శించారు. అయితే ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కుతూ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్న 6నెలల కాలంలో రెండుసార్లు విద్యుత్ చార్జీలను పెంచి రాష్ట్ర ప్రజలపై దాదాపుగా 15485కోట్ల అదనపు భారాన్ని మోపడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ చార్జీల బాదుడుపై పోరాటానికి సిద్ధం అయ్యామన్నారు. విద్యుత్ చార్జీలను పెంచి ప్రజల నడ్డివిరుస్తున్నారని తెలిపారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబునాయుడు అనేక సభల్లో జగన్మోహన్ రెడ్డి బాదుడే బాదుడని వెటకారంగా మాట్లాడటాన్ని ప్రజలు గమనించారని, అయితే నేడు చంద్రబాబు పెంచిన విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నామని ఎద్దేవా చేశారు. అలాగే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా నీకు 15వేలు, నీకు 15వేలు, నీకు 18వేలు, నీకు 18వేలు అంటూ చెప్పిన పథకాలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తే నాడు చంద్రబాబు నాయుడు వాటిని పగులగొట్టండని పిలుపు నిచ్చారని, నేడేమో స్మార్ట్ మీటర్లను బిగించుకోండని చెప్పడం ఎంతో విడ్డూరంగా ఉందన్నారు. 200 యూనిట్లు ఉచితంగా పేదలకు ఇస్తామని చెప్పి విద్యుత్ బిల్లులను వసూలు చేస్తున్నారని గుర్తుకు చేశారు.ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సంపద సృష్టిస్తున్న సంపద ఎక్కడికి పోతున్నది, ఎవరి జేబుల్లోకి పోతున్నదో చెప్పాలన్నారు. రైతన్నలకు గిట్టుబాటుధరను కల్పించండని రైతన్నలు రోడ్డునెక్కారని, టీడీపీ కూటమి ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. పెన్షన్ల పరిశీలన పేరుతో అనేక పెన్షన్లను తొలగించే ప్రక్రియను చేపడుతున్నారని ఇది సరికాదన్నారు. డ్రైవర్షన్ రాజకీయాలను చేస్తూ ప్రజలను ప్రక్కదారి పట్టించేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, టీడీపీ మోసపు మాటలను నమ్మరని, ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలను తిరస్కరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జెట్‌పిటిసిలు పోచా జగదీశ్వరరెడ్డి సోముల సుధాకర్ రెడ్డి అహ్మద్,ప్రచారకమిటి జిల్లా అధ్యక్షులు కొకిల రమణారెడ్డి,మాజీ జడ్పీటీసీ నాగిరెడ్డి నాగరాజు లోకేశ్వరరెడ్డి,కృష్ణారెడ్డి,దు