- Advertisement -
టీడీపీ నాయకులు మీసాల సుబ్బారావు మృతి
TDP leader Misala Subbarao passed away
ఘనంగా నివాళులర్పించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు
ఇబ్రహీంపట్నం,
ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మీసాల సుబ్బారావు (64) మంగళవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మంగళవారం మూలపాడు గ్రామంలోని అయన నివాసానికి విచ్చేసి, ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన పార్ధీవదేహంపై తెలుగుదేశం పార్టీ జెండాను కప్పి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేశారు. ఆయన పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. ఎన్డీఏ కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -