టీడీపీ ది పేదల సంక్షేమం…-మాది జవాబుదారీ ప్రభుత్వం

- Advertisement -

టీడీపీ ది పేదల సంక్షేమం…-మాది జవాబుదారీ ప్రభుత్వం

TDP the welfare of the poor...-our accountable government

పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి

ఆమడగూరు:20

టీడీపీ ది పేదల సంక్షేమ ప్రభుత్వమని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పేర్కొన్నారు. అమడగూరు మండలం పూల కుంట్లపల్లి పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కలసి ప్రారంభించారు. ముందుగా ప్రభుత్వ పాఠశాలను ఎమ్మెల్యే తనిఖీ చేశారు. విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధించారు. పాఠశాలకు సక్రమంగా హాజరుకావాలని అందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగం పొంది సమాజాభివృద్ధికి పాటుపడాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు ఎమ్మెల్యే మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పుట్టపర్తి నియోజకవర్గం ఆమడ గూరు మండలం పూల కుంట్ల పల్లి పంచాయతీ నుంచి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు. ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లు రూ.3000 నుంచి ఒకే సారి రూ.4000 లకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి అత్యంత సాహోపేతమైన నిర్ణయం తీసుకున్నారనీ పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1న జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టారు. విజయవాడలో వరద బాధితులను కంటికి రెప్పలా 10 రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజల్ని ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. నిరుద్యోగ యువతీ యువకులకు అండగా 16 వేల437 మందికి ఉద్యోగాలు కల్పించడానికి టీడీపీ ప్రభుత్వం మెగా డీఎస్సీ నీ ప్రకటించడం హర్షించదగ్గ  శుభ పరిణామం అన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా రూ.5 లకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్ లకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. పుట్టపర్తి లో అన్న క్యాంటీన్ ను ప్రారంభించినట్లు గుర్తు చేశారు. పంచాయతీలకు రూ. 1452 కోట్లు మంజూరు చేసి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రన్న  కూటమి ప్రభుత్వం అన్నారు. వెనుకబడిన సత్యసాయి జిల్లా లో కీయా వంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పరిశ్రమ రావడం వల్ల ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు పుణ్యమే అన్నారు.అదే విధంగా పుట్టపర్తి నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆమడ గూరు మండలానికి ఉపాధి హామీ పథకం ద్వారా రూ.3 కోట్లతో నిధులు మంజూరు అయ్యాయని, ఇందులో 1 కోటి మంజూరు చెసినట్లు తెలిపారు. అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తామని చెప్పారు. గ్రామానికి శ్మశానం ,త్రాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular