Thursday, April 10, 2025

తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు: గవర్నర్ తమిళిసై  

- Advertisement -

 రాజ్‌భవన్‌కు- ప్రగతిభవన్‌కు ఎలాంటి గ్యాప్‌ లేదు

నిబంధనలతో అడ్డుకొనే ప్రయత్నమా అని ప్రశ్న

telangana-birthday-my-birthday-is-on-the-same-day-governor-tamilisai
telangana-birthday-my-birthday-is-on-the-same-day-governor-tamilisai

హైదరాబాద్, సెప్టెంబర్ 8 (వాయిస్ టుడే): తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిబంధనలతో తనను అడ్డుకోలేరన్నారు. రాజ్‌భవన్‌లో జరిగిన కాఫీ టేబుల్‌ బుక్‌ ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన గవర్నర్‌.. ప్రజలకు సేవ చేయడానికే తెలంగాణకు గవర్నర్‌గా వచ్చానన్నారు. కోర్టు కేసులు, విమర్శలకు తాను భయపడనన్నారు. సవాళ్లు, పంతాలు తనను అడ్డుకోలేరన్నారు. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో తనను కట్టడి చేయలేరని గవర్నర్‌ తేల్చి చెప్పారు.  తనది మోసం చేసే మనస్తత్వం కాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాను గవర్నర్ గా నాలుగేళ్లు పూర్తి చేసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో గవర్నర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్‌ నామినేషన్‌ కాదన్నారామె. ఎమ్మెల్సీ కి అర్హత ఉందని అనిపిస్తే సంతకం చేయడానికి నాకేలాంటి ఇబ్బంది లేదన్నారు. రాజ్‌భవన్‌కు- ప్రగతిభవన్‌కు ఎలాంటి గ్యాప్‌ లేదన్నారామె. ఇక ఆర్టీసీ బిల్లుపై అనవసర రాద్ధాంతం జరిగిందన్న తమిళిసై తాను కార్మికుల లబ్ధి కోసమే బిల్లుపై ప్రశ్నించానని గుర్తు చేశారు. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల కేటగిరిపై, ప్రభుత్వం పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అనేది పొలిటికల్‌ నామినేషన్‌ కాదు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కి అర్హత ఉంది అని అనిపిస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. రాజ్ భవన్‌కు ప్రగతి భవన్‌కు ఎలాంటి గ్యాప్ లేదు. గ్యాప్ అనేది నేను ఎప్పుడూ ఆలోచన చేయలేద’ని చెప్పుకొచ్చారు.రాజ్యాంగ పరిరక్షరాలిగా తన బాధ్యతలను నిర్వహిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రజల విజయమే తన విజయంగా ఆమె పేర్కొన్నారు. సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్టుగా తమిళిసై సౌందరరాజన్ గుర్తు చేసుకున్నారు. తనపై తెలంగాణ ప్రజలు చూపిన అభిమానానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా పనిచేయడం తనకు సంతోషంగా ఉందని గవర్నర్ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.తాను  ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోనని..  సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కానని గవర్నర్ తెలిపారు.  బాధ్యతలు, విధులను సమర్థవంతగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నానని సంతృప్తి వ్య్కతం చేశారు.  అలాగే కోర్టు కేసులకు, విమర్శలకు భయపడబోనన్నారు.  ప్రొటోకాల్‌ ఉల్లంఘనతో తనను కట్టడి చేయలేరని తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా…  ప్రజల విజయమే విజయమని తమిళిసై వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం.. కొట్లాడే ఉద్దేశం లేదన్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ లీడర్.. పవర్ ఫుల్ నేత. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన నేను చూస్తున్నా. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్‌ లేదు. సీఎంతో ఎలాంటి దూరం లేదు. దూరం గురించి నేను పట్టించుకోను… తన దారి తనదేనన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది కానీ  గవర్నర్ ఆఫీస్‌కు కొంత లిమిట్ ఉందని తమిళిశై గుర్తు చేశారు.  నిధుల కొరత కూడా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడం తప్ప..పొలిటికల్ ఎజెండా లేదన్నారు. తనది మోసం చేసే తత్వం కాదని స్పష్టం చేశారు.   తెలంగాణ బర్త్ డే- నా బర్త్ డే ఒకేరోజు. నా మైండ్ లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుందన్నారు. తాను   నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తినన్నారు.  పుదుచ్చేరికి కూడా గవర్నర్ గా ఉన్నా.. తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా. అడ్మిస్టేషన్ పరంగా రెండు రాష్ట్రాలకూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్ అధికారులు రారు. కానీ, పుదుచ్చేరిలో సీఎస్ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నాను. నాకు గౌరవం ఇస్తారా.. నా పనిని గుర్తిస్తారా? అనేది నాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఇక తెలంగాణ పుట్టిన రోజు, తన పుట్టిన రోజు ఒకే రోజున్న గవర్నర్‌ తన మనసులో ప్రజలకు సేవ చేయాలనే భావనే ఉంటుందన్నారు. తన కుటుంబ నేపథ్యం అంతా రాజకీయాలే అన్న తమిళిసై.. తాను గౌరవం కోసం కొట్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తాను నిత్యం సంతోషంగా ఉండాలని కోరుకునే వ్యక్తినని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పుదుచ్చేరి గవర్నర్‌గా సేవలందిస్తున్నా తెలంగాణకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. రెండు రాష్ట్రాలకు తన బాద్యతను నిర్వర్తిస్తున్నా.. తెలంగాణలో జిల్లాలకు వెళ్తే అధికారులు రారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ పుదుచ్చేరిలో మాత్రం సీఎస్‌ సహా చాలా మందిని పర్యవేక్షిస్తానని చెప్పుకొచ్చారు మరి గవర్నర్‌ చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి సంచలనం రేపుతాయో చూడాలి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్