- Advertisement -
గోదావరి వరదలకు కుంగిన కాకతీయుల నాటి దేవాలయం
Temple of the Kakatiyas that collapsed due to Godavari floodsఖమ్మం
యాంకర్ వాయిస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి ఎగువన కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి మధ్యలో 13వ శతాబ్దంలో కాకతీయులు నిర్మించిన భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయం కోతకి గురైంది బీటలు బారి శిధిలావస్థకు చేరుకుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున వీరభద్రుడి కళ్యాణం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది. వీరభద్ర స్వామి కళ్యాణానికి పొరుగు రాష్ట్రాలైన చత్తీస్ గడ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి గిరిజనులు, గిరిజనేతరులువేలాది గా తరలి వస్తారు. ఈ యొక్క వీరభద్రుని ఆలయానికి మరమ్మత్తులు చేయించి భక్తులకు సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుకుంటున్నారు.
- Advertisement -




