నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పీవీ
-కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా మాజీ ప్రధాని పీవీ జయంతి వేడుకలు
మంథని
భారతదేశంలో నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పీవీ నరసింహారావు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు కొనియాడారు.
శుక్రవారం మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు జయంతి కార్యక్రమాన్ని మంథని పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆయిలీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ
బహుభాషా కోవిదుడు, రచయిత తెలుగు తొలి ప్రధాని పీవీ నరసింహారావు అనేక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేశారన్నారు.
మంథని నియోజక వర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అనేకమైన సేవలందించారని కొనియాడారు. 13 భాషలు అనర్గళంగా మాట్లాడే వ్యక్తి పివి అని ఆ మహనీయుని ఆశయం సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆయిలి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుదుల వెంకన్న, జిల్లా కార్యదర్శి జనగామ నరసింగరావు,పాక్స్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మంథని మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు,వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, టౌన్ యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాదుల శ్రీకాంత్ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్, పేరవేన లింగయ్య, మాజీ మార్కెట్ చైర్మన్ అజీమ్ ఖాన్ ,బ్లాక్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి వేల్పుల రాజు, ఎస్సీ సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షులు పర్శేవెన మోహన్, బీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ జి, బీసీ సెల్ జిల్లా కార్యదర్శి మంథని సురేష్, బీసీ సెల్ డివిజన్ అధ్యక్షులు రవితేజ గౌడ్,బీసీ సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ అలీం నాయకులు రేపాక శ్రీకాంత్,రంజిత్ కుమార్, రోడ్డ రాజేశ్వరరావు, కందుకూరి రామ్మూర్తి, పార్వతి కిరణ్, సురేష్, రాము,మంథని శ్రీనివాస్, సతీష్, ఎండి ఐసాన్, ప్రవీణ్, లక్ష్మణ్, జాఫర్, తదితరులు పాల్గొన్నారు.




